“లైగర్” కి క్రిస్ప్ రన్ టైం సెట్ చేసిన పూరీ….?

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర మంచి అంచనాలు నెలకొల్పుకొని ఉన్న చిత్రాల్లో టాలీవుడ్ యంగ్ జెనరేషన్ హీరోలు నటించిన సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఈ చిత్రాల్లో అయితే రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ యంగ్ హాట్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న భారీ ఏక్షన్ చిత్రం “లైగర్”.

దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కి సిద్ధంగా ఉండగా పాన్ ఇండియా వైడ్ కూడా మంచి అంచనాలు నెలకొల్పుకుంది. ఇక ఈ చిత్రం నుంచి అయితే ఒకో అప్డేట్ బయటకి వస్తుండగా లేటెస్ట్ గా అయితే ఈ సినిమాని మేకర్స్ ఎంత రన్ టైం కి కట్ చేసారో క్లియర్ అయ్యింది.

ఈ చిత్రాన్ని దర్శకుడు పూరి మొత్తం రెండు గంటల 20 నిమిషాల నిడివితో కట్ చేశారట. ఇది ఓ రకంగా మంచి క్రిస్ప్ రన్ టైం అని చెప్పాలి. అయితే ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ మొత్తం 1 గంట 15 నిముషాలు ఉంటుందట. అలాగే సెకండాఫ్ వచ్చేసరికి ఒక గంట 5 నిముషాలు టోటల్ గా టైటిల్స్ తో కలిపి ఉంటుందట.

మరి ఈ కొద్ది సేపులో అయితే విజయ్ అండ్ పూరి సెన్సేషనల్ కాంబో ఎలాంటి విధ్వంసం చేస్తారో చూడాలి. ఇక ఈ చిత్రంలో బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించగా ఈ సినిమా ఈ ఆగస్ట్ 25న రిలీజ్ కాబోతుంది.