రేపే రిలీజ్…ఈ లోగా సినిమాపై కోర్టు స్టే

హవీష్ హీరోగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడ‌క్ష‌న్‌లో రమేష్ వర్మ నిర్మించిన డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘సెవెన్’. రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలు. రహమాన్, సుంకర లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నెల 5న సాయంత్రం పెయిడ్ ప్రీమియర్లతో మ‌ల్టీప్లెక్స్‌ల‌లో సినిమా విడుదలవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 6న విడుదల చేస్తున్నారు. అయితే అనుకోని విధంగా లాస్ట్ మినిట్ లో ‘7’ మూవీ విడుదలకు బ్రేక్ పడింది.

ఈ మూవీ విడుదలపై హైదరాబాద్ సివిల్ కోర్ట్ స్టే విధించింది. చిత్రం నిర్మాణంలో భాగస్వామ్యం ఇస్తానని రమేష్ వర్మ తన దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నారని, కానీ తనకు సినిమాలో భాగస్వామ్యం ఇవ్వకపోగా.. తన దగ్గర తీసుకున్న డబ్బు కూడా వెనక్కి ఇవ్వలేదని ఎన్ ఆర్ ఐ కిరణ్ కె.తలశిల పేర్కొన్నారు. ఈ విషయమై పలుమార్లు అడిగినా రమేష్ వర్మ స్పందించలేదని, ఫిల్మ్ ఛాంబర్ దృష్ఠికి తీసుకు వెళ్లినా తనకు న్యాయం జరగకపోవడంతో.. న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సివచ్చిందని కిరణ్ తెలిపారు.

సినిమాలో తారాగణం:
పి. శ్రీనివాసరావు, రామరాజు, ఏడిద శ్రీరామ్, విద్యులేఖ రామన్, ‘జబర్దస్త్’ వేణు, ధనరాజ్, సత్య, ‘జోష్’ రవి, సుదర్శన్, ప్రవీణ్, బాషా, సందీప్, అల్కా రాథోర్, జె.ఎల్. శ్రీనివాస్ తదితరులు.

సినిమా సాంకేతిక వర్గం:
స్టిల్స్: శీను, పీఆర్వో: సురేంద్ర కుమార్ నాయుడు – ఫణి కందుకూరి, డీఐ: లెజెండ్ స్టూడియో, కలరిస్ట్ రంగ, వి.ఎఫ్.ఎక్స్: ప్రసాద్ గ్రూప్, చీఫ్ కో-డైరెక్టర్: వేణు పిళ్ళై, కో-డైరెక్టర్: జగన్నాథ్ ఎం.ఆర్(రమేష్), ఆర్ట్ డైరెక్టర్: గాంధీ, లిరిక్స్: శ్రీమణి, పులగం చిన్నరాయణ, శుభం విశ్వనాధ్, కొరియోగ్రఫీ: సతీష్, విజయ్, డైలాగ్స్: జీఆర్ మహర్షి, స్టంట్స్: వెంకట్ మహేష్, ఎడిటర్: ప్రవీణ్ కెఎల్, మ్యూజిక్ డైరెక్టర్: చైతన్ భరద్వాజ్, కో-ప్రొడ్యూసర్: కిరణ్ కె. తలశిల (న్యూయార్క్), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామకృష్ణ, స్టోరీ-స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసర్: రమేష్ వర్మ, సినిమాటోగ్రఫీ – దర్శకత్వం నిజార్ షఫీ.