కేవలం ఒక “వాచ్” పవర్ స్టార్ మరియు ఆయన ఫాన్స్ పరువు తీసేసింది!

Controversy running around pawan kalyan watch

పవన్ కళ్యాణ్ నటిస్తున్న “వకీల్ సాబ్ ” మూవీ కరోనా కారణంగా పోస్టుపోన్ అవ్వటం చేత , గ్యాప్ లో దీక్ష చేపట్టి ఫార్మ్ హౌస్ లోనే ఉండిపోయారు. దీక్ష ముగిసిన వెంటనే షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇది తెలిసిన దగ్గర నుండి ఆయన అభిమానుల్లో సంతోషం ఉప్పొంగుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బయటికి అడుగు పెట్టాడంటే అందరి చూపూ ఆయన మీదే ఉంటుంది. ఆయనకు సంబంధించి ప్రతి విషయం వార్తే. ఏడు నెలలకు పైగా విరామం తర్వాత పవన్ ఇటీవలే తిరిగి షూటింగ్‌కు హాజరవుతున్న సంగతి తెలిసిందే. ‘వకీల్ సాబ్’కు సంబంధించి కీలక సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొంటున్నాడు పవన్. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతోంది.

ఐతే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినప్పటికీ రాజకీయాలనేమీ పక్కన పెట్టేయని పవన్.. మధ్య మధ్యలో పార్టీ పనులు చూసుకుంటూనే ఉన్నాడు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో ఉండగానే షూటింగ్ గ్యాప్‌లో జనసేన తెలంగాణ కమిటీలను ఖరారు చేసి దానికి సంబంధించిన ఫైల్ మీద సంతకాలు చేశాడు పవన్. జనసేనాని రాజకీయాలపై సీరియస్‌గానే ఉన్నాడని సంకేతాలు ఇవ్వడం కోసమో ఏమో.. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా మీడియాకు విడుదల చేశారు.

Controversy running around pawan kalyan watch
Controversy running around pawan kalyan watch

ఐతే ఆ ఫొటోలకు సంబంధించి పవన్ అభిమానుల దృష్టి ఒకలా ఉంటే.. వ్యతిరేకుల దృష్టి మరోలా ఉంది. పవన్ అందులో ధరించిన రోలెక్స్ వాచీ గురించి చర్చ మొదలు పెట్టారు. దాని ధర రూ.40 లక్షలకు పైగానే అట. తాను చాలా సింపుల్ అని చెప్పుకునే పవన్ ఇంత ఖరీదైన వాచ్ ధరించాడేంటి అని వాళ్లు ప్రశ్న లేవనెత్తారు. ఐతే అసలు విషయం ఏంటంటే..సినిమా చిత్రీకరణలో భాగంగా ఆ వాచ్ ధరించారని సమాచారం.అది రుజువు చేయడానికి పవన్ అభిమానులు కష్టపడాల్సి వస్తుంది.

ఇంతకుముందు ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పవన్ లుక్ ఒకటి పరిశీలిస్తే అందులో పవన్ ఈ వాచీనే ధరించాడు. కంటిన్యుటీ కోసం అదే వాచ్‌తో షూటింగ్‌కు హాజరయ్యాడు. మన సినిమాల్లో హీరో ఆర్థికంగా ఏ స్థాయిలో ఉన్నా సరే.. ఖరీదైన బట్టలు, యాక్ససరీస్ ధరించాల్సిందే. అందులో భాగంగానే పవన్‌కు ఆ వాచీ పెట్టినట్లున్నారు. బయట అయితే ఇంత ఖరీదైన వాచీ పెట్టుకుని తిరిగే వ్యక్తి కాదు అని ఆయన్ని ఫాలో అయ్యే ఆందరికి తెలుసు.