ప్రముఖ హాస్యనటుడికి తీవ్ర అనారోగ్యం.. పరిస్థితి ఏమాత్రం బాలేదంటూ ఓ సెక్షన్ మీడియాలో ప్రచారం అవుతోంది. కాలేయ వ్యాధి.. కిడ్నీ సమస్యలు.. అంటూ పరిస్థితిని చాలా సీరియస్ అంటూ కథనాలు వేశారు. అయితే ఆ కథనాల్లో సదరు కమెడియన్ పేరు కూడా ప్రస్థావించారు. అయితే ఇది నిజమా? ఇటీవల ఈ తరహా ప్రచారం పెచ్చురిల్లుతోంది. అసలు నిజమేంటి? అన్నది కన్ఫామ్ చేసుకోకుండా ఏది పడితే అది రాసేస్తుండడంతో అది కాస్తా ఆ తర్వాత రచ్చవుతోంది.
“తెలుగు చిత్రసీమలో కమెడియన్ గా తనదైన ముద్రను వేసిన ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల సమస్య తీవ్రం కావడంతో సికింద్రాబాద్ యశోదా హాస్పటల్ లో చేరారు. కిడ్నీ సమస్యలు కూడా తలెత్తడంతో ఆయన ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని హాస్పటల్ వైద్యులు తెలిపారు…“ అంటూ తాజాగా మీడియాలో ప్రచారం సాగుతోంది.
అయితే ఇంతకుముందు ఇదే కమెడియన్ చనిపోయారని కూడా వార్తలు ప్రచురించేసిన సదరు మీడియాలు ఆనక ఆయన ఇంకా బతికే ఉన్నారు అని తెలిసి నాలుక కరుచుకున్నారు. “నేను చావక ముందే చనిపోయాను అంటూ రాశారు!“ అంటూ సదరు కమెడియన్ మీడియాల నిర్వాకంపై చాలా సీరియస్ అయ్యారు. అయితే ఆ కమెడియన్ వ్యక్తిగత .. కుటుంబ జీవితంలో కలతలతో ఆల్కహాల్ కి అలవాటు పడి ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నారని ఆ క్రమంలోనే లివర్, కిడ్నీ సమస్యలు తలెత్తాయని బయట ప్రచారం ఉంది. తాజాగా పరిస్థితి సీరియస్.. అతడికి వెంటిలేటర్ చికిత్స జరుగుతోంది అన్నదానికి మరింత క్లారిటీగా కుటుంబ సభ్యుల నుంచి వివరణ పత్రం విడుదల అయితే బావుంటుందేమో…. కంగారు పడి ఏదో ఒకటి రాసేయకుండా..!!
