`సింగం` కాంబినేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సూర్య-హరి చేతులు కలిపిన `సింగం` ప్రాంచైజీ నుంచి రిలీజ్ అయిన `సింగం`, `సింగం-2 `భారీ విజయాల్ని నమోదు చేసాయి. ఈ రెండు సక్సెస్ లు సూర్యకు ప్రత్యేకమైన గుర్తింపు..మార్కెట్ తీసుకొచ్చాయి. సూర్యలో సిసలై యాక్షన్ హీరోని ఎలివేట్ చేసిన చిత్రాలవి. ఆ నమ్మకంతో `సింగం-3`ని కూడా తెరకెక్కించారు. కానీ కంటెంట్ రొటీన్ గా ఉండటం తో మూడు రాష్ర్టాల( తమిళనాడు-తెలంగాణ-ఆంధ్రప్రదేశ్) బాక్సాఫీస్ వద్ద ఘోరంగా చతికిల పడాల్సి వచ్చింది. అయినా సింగం కాంబినేషన్ పై అంచనాలు ఏమాత్రం తగ్గలేదు. సింగం ఫ్యాన్స్` సింగం -4` ఎప్పుడు అంటూ హరి-సూర్యలని ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉన్నారు.
`సింగం-4` కూడా ఉంటుందని సూర్య మొదట్లో రివీల్ చేసాడు. అయితే ఆ టైటిల్ తో తెరకెక్కుతోందా? కొత్త టైటిల్ ని తెరపైకి తీసుకొస్తారా? అన్న దానిపై సూర్య కూడా అనుమానం వ్యక్తం చేసాడు. ఈ నేపథ్యంలో సూర్య తో `అరువా` అనే టైటిల్ తో మరో సినిమా చేస్తున్నట్లు హరి ప్రకటించాడు. కానీ అనూహ్యంగా సూర్య ప్రాజెక్ట్ ని స్కిప్ చేసి వెంట్రీ మారన్ దగ్గరకు చేరాడు. అతనితో `వాడి వాసల్` అనే సినిమా చేస్తున్నట్లు ఆ ద్వయం ప్రకటించింది. ఈ ప్రకటన చూసి హరి ఖంగుతున్నాడు. తనకు తెలియకుండా సూర్య ఈ ప్రకటన చేసినట్లు ఆశ్చర్యం వ్యక్తం చేసాడు. దీంతో హరి ఈగో హర్ట్ అయింది. అదే ప్రాజెక్ట్ ని అరుణ్ విజయ్ తో తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించాడు.
ఇంతలో సూర్య `వాడి వాసల్ ` పనులు ముమ్మరం చేసాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వాడి వేడి యుద్ధమే జరుగుతున్నట్లు కోలీవుడ్ మీడియాలో కథనాలు స్కైని టచ్ చేస్తున్నాయి. ఇరువురు మధ్య నువ్వా? నేనా? అన్నంతగా విబేధాలు తలెత్తినట్లు తంబీల్లో చర్చనీయాంశంగా మారింది. ఇరువురు మధ్య తలెత్తిన క్లాషెస్ పై కోలీవుడ్ లో కూడా హాట్ హాట్ గా డిడేట్ నడుస్తోంది. దీంతో వివాదం ముదరకుండా కోలీవుడ్ పెద్దలు ఈ వార్ లోకి రంగ ప్రవేశం చేసినట్లు తాజా సమాచారం. సూర్య-హరిని ఛాంబర్ హాలులోకి పిలిచి కూర్చొబెట్టి వివాదాన్ని పరిష్కరించడానికి సిద్దం అవుతున్నట్లు సమాచారం అందింది.