కీర్తి సురేష్ తల్లి కు అంత భయం ఎందుకు?

‘మహానటి’ చిత్రంతో విపరీతమైన క్రేజ్ ను తెచ్చుకున్న మలయాళ బ్యూటీ కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అదే సమయంలో ఆమె రాజకీయ రంగ ప్రవేశం కూడా చేయబోతోందని వార్తలు వస్తున్నాయి. ఆమె భారతీయ జనతా పార్టీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కీర్తి…బీజేపీ తరఫున ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించింది. అంతేకాదు ఆమె ఇతర నటీనటులతో కలిసి ప్రధాని మోదీని కలిసిన ఫొటోలు సైతం బయటకు వచ్చాయి.

అక్కడితో ఆగకుండా మోదీ స్వయంగా కీర్తి సురేశ్‌ ను రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారని కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంతవరకూ అధికారికంగా కీర్తి స్పందించకపోయినా, ఆమె తల్లి మేనక సురేశ్ మాత్రం స్పందించారు.

మేనక సురేష్ మాటట్లాడుతూ…తన భర్త బీజేపీలోనే ఉన్నారని, ఆయన తరుపున కీర్తి సురేశ్ ప్రచారం చేసిన మాట వాస్తవమేగానీ, ఇప్పటివరకూ ఆ పార్టీ సభ్యత్వం కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు.

ఇక ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత సురేశ్ గోపి, కవిత వంటి నటీనటులతో కలిసి తాము మోదీని కలిశామని, ఆ ఫోటోలనే చూపిస్తూ, తన కుమార్తె రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రశ్నిస్తున్నారని, ఇప్పటికైతే తమకు రాజకీయాలపై ఆసక్తి లేదని మేనక సురేశ్ వ్యాఖ్యానించారు. అయితే ఇది విన్న వారంతా …ఆమె తల్లి అనవసరంగా భయపడుతోందని, ఫలానా పార్టీ అంటే సినిమా ఆఫర్స్ ఏమీ తగ్గిపోవని అంటున్నారు. చాలా మంది స్టార్స్ తాము ఫలానా పార్టికి సపోర్ట్ చేస్తున్నామని ఎలక్షన్స్ టైమ్ లో చెప్తూంటారని, అంతమాత్రాన వారి కెరీర్ కు వచ్చిన నష్టమేమి లేదని వ్యాఖ్యానిస్తున్నారు.