టాలీవుడ్ ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఛోటా కే నాయుడు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయారు. చాలా పోస్ట్ లలో ఆయన గురించే డిస్కషన్. ‘కవచం’ టీజర్ లాంచ్ కార్యక్రమంలో కాజల్ మాట్లాడుతూ తన గురించి ప్రస్తావించగానే.. అతను దగ్గరికెళ్లి ఆమెకు ముద్దిచ్చేయడం వివాదాస్పదంగా మారింది.
అలా బహిరంగంగా ముద్దు పెట్టడం, అదీ టీవి ఛానెల్స్ లైవ్ ఇస్తున్న సమయంలో చేయటం చాలా మందికి కోపం తెప్పించింది. కేవలం కాజల్ అభిమానులే కాదు.. మామూలువాళ్లు సైతం ఛోటాని తీవ్రంగా విమర్శిస్తున్నారు. కాజల్ కే కోపం రానప్పుడు మీకెందుకు అని కొందరు సమర్దిస్తున్నా..ఆగేటట్లు లేదు.
మరికొందరు నెటిజన్స్ ఓ అడుగు ముందుకేసి చోటా కె నాయుడుని టార్గెట్ చేస్తూ ఆయనని ఇండస్ట్రీ నుండి బహిష్కరించాలని పోస్ట్ లు మొదలెట్టారు. అంతటితో ఆగకుండా గతంలోను పలు సందర్భాలలో చోటా కె నాయుడు హీరోయిన్స్‌తో అసభ్యంగా మాట్లాడంటూ పాత వీడియోలని తీసి మరీ సోషల్ మీడియాలో ఆయనని ట్రెండ్ చేస్తున్నారు.
చూస్తూంటే ఈ వివాదం పెద్దదిగా మారుతోందని… చోటా కె నాయుడు ఈ వివాదంపై స్పందించారు. సౌందర్య తర్వాత నేను అంతగా అభిమానించే హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఆమెతో చాలా సినిమాలు చేశాను. నా ముద్దు వెనుక ఉన్న కారణం ఆమె పనితనం మెచ్చుకోవడమే తప్ప మరో ఉద్ధేశం లేదు అని వివరణ ఇచ్చారు .