కొరటాల శివ, చిరు చిత్రం టైటిల్ ఇదేనా? నప్పుతుందా

వరస హిట్స్ తో దూసుకుపోతున్న దర్శకుడు  కొరటాల శివ తన  తదుపరి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే.   ఈ ఏడాది చివరిలో సెట్స్‌పైకి రానున్న ఈ చిత్రంపై అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. దాంతో మీడియాలో ఈ చిత్రం గురించి రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ చిత్రం టైటిల్ గురించి ఓ న్యూస్ ..చిరు అభిమానులను ఆకట్టుకుంటోంది.


ప్రస్తుతం చిరు సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరకు అయిపోతుందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తవగానే కొరటాల షూటింగ్‌లో చిరు పాల్గొంటారని టాక్. ప్రస్తుతం కొరటాల ఈ సినిమా కోసం స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

మెసేజ్‌తో కూడిన సోషల్ డ్రామాగా  తెరకెక్కించాలని ప్లాన్ చేసిన ఈ సినిమాకు ‘రైతు’ అనే టైటిల్ అనుకుంటున్నారట. తెలుస్తోంది. అలాగే ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. ఈ సినిమా హీరోయిన్‌గా అనుష్కను అడుగుతున్నట్టు సమాచారం. భాగమతి సినిమా తర్వాత అనుష్క ఏ సినిమాకూ సైన్ చేయలేదు. 


దాంతో చిరు సరసన అనుష్క అయితే బాగుంటుందని భావించిన కొరటాల శివ ఆమెను సంప్రదించినట్టు వార్తలు చెప్తున్నారు. చిరంజీవి ప్రక్కన అనగానే ..ఈ సినిమాకు అనుష్క కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇవన్నీ గాలి వార్తలే ఇప్పటివరకూ.  అధికారిక సమాచారం వెలువడితే తప్ప  క్లారిటీ రాదు.