వైరల్ : పవన్ విషయంలో హీట్ పెంచిన చిరు పొలిటికల్ వ్యాఖ్యలు.!

లేటెస్ట్ గా థియేటర్స్ లో రిలీజ్ కి సిద్ధంగా ఉన్నటువంటి భారీ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రల్లో నటించిన చిత్రం “గాడ్ ఫాదర్” కూడా ఒకటి. అయితే ఈ సినిమా రేపు రిలీజ్ అనగా ఈరోజు వరకు చిరు అయితే తన వల్ల అయ్యింది అంతా చేస్తూ వస్తున్నారు.

ఈ రోజు మీడియా వారితో జరిపిన ప్రెస్ మీట్ లో అయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు బయటకి వచ్చాయి. మరి ఇందులో అయితే చిరు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ విషయంలో చేసిన కామెంట్స్ హీట్ పెంచాయి.

తాను గతంలో పవన్ జనసేనకు మద్దతు ఇస్తానని ఎక్కడా చెప్పలేదని బహుశా నాకు గుర్తు కూడా ఉండకపోవచ్చు కానీ పవన్ లాంటి నిజాయితీపరుడు రాజకీయాల్లో కావాలి అని అన్నయ్యగా భవిష్యత్తులో ఎలా ఉంటుందో చెప్పలేను కానీ పవన్ లాంటి నాయకుడు ఈ సమాజానికి కావాలి అన్నగా ప్రజలు పవన్ ని ఎంచుకుంటే బాగుంటుంది అనుకుంటున్నానని తెలిపారు.

అలాగే జనసేన లో చేరడం అనే అంశంపై కూడా స్పందిస్తూ ఇపుడు నేను రాజకీయాల్లో లేకపోవడమే కళ్యాణ్ కి బాగుంటుంది అని అనుకుంటున్నానని కూడా చిరు వ్యాఖ్యలు చేశారు. దీనితో ఇవి అయితే ఇపుడు మంచి సెన్సేషన్ గా మారుతున్నాయి.