శిఖరంలా ఎదిగిన త‌ర్వాత‌ మెగాస్టార్ కి త‌ప్ప‌లేదు ఆ తిప్ప‌లు!

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ఓ మ‌హోన్న‌త వ్య‌క్తి. ఓ వ్య‌వ‌స్థ‌. ఓ సృష్టి. ఆయ‌నో శిఖ‌రం. తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కి మెగాస్టార్ సేవలు చిర‌స్మ‌ర‌ణీయం..ఓ చ‌రిత్ర‌. మెగాస్టార్ గురించి మాట్లాడాలంటే ఆయ‌నకు ముందు..త‌ర్వాత అని క‌చ్చితంగా చెప్పుకోవాల్సిందే. టాలీవుడ్ లో మెగాస్టార్ సినీ ప్ర‌స్థానం గురించి తెలియ‌ని వారుంటారా! ఆయ‌న అభిమాని కానిది ఎవ‌రు? ఆయ‌న చ‌రిత్ర తెలియ‌న‌ది ఎవ‌రికి? ఆయ‌న బాక్సాఫీస్ స్టామినా తెలియంది ఎవ‌రికి? బాస్ ఎప్ప‌డు రంగంలోకి దిగినా సీటీ ఒకేలా ఉంటుంద‌ని ఎన్నోసార్లు నిరూపించారు. ద‌టీజ్ మెగాస్టార్. నాలుగు ద‌శాబ్ధాల సినీ ప్ర‌స్థానం. వ‌య‌సుతో పాటు ఆయ‌న క్రేజ్ అంత‌కంత‌కు పెరిగిపోతుంది! అన‌డానికి `ఖైదీ నంబ‌ర్ 150` స్కోరే బెస్ట్ ఎగ్జాంపుల్..బాస్ గ్యాప్ ఇచ్చాడు త‌ప్ప గ్యాప్ తీసుకోలేదు.

chiranjeevi
chiranjeevi

అయినా 150వ సినిమాతో 150 కోట్ల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద ఓ చ‌రిత్ర రాసారు. `ప్రాణం ఖ‌రీదు` నుంచి మొన్న‌టి `సైరా న‌ర‌సింహారెడ్డి` వ‌ర‌కూ ప్ర‌తీ సినిమా ఓ ప్ర‌త్యేక‌త‌తో కూడుకున్న‌దే. నేటి త‌రం హీరోల‌కు సిస‌లైన పోటీ ఇస్తోన్న ఒకే ఒక్కస్టార్ ఆయ‌నే మెగాస్టార్. అయితే ఇంత‌టి న‌ట దిగ్గ‌జం..స్టార్ హీరోగా..మెగాస్టార్ గా వెలిగిపోతున్న రోజుల్లో ద‌ర్శ‌క, ర‌చ‌యిత‌ల‌కే చిరంజీవి స‌వాల్ విసిరారు. ఈ స‌మ‌యంలో ఎలాంటి క‌థలు ఎంపిక చేసుకోవాలో తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. అప్ప‌టికే బిగ్ బాస్ , రిక్షావాడు, మెకానిక్ అల్లుడు లాంటి సినిమాలు చిరంజీవికి తీవ్ర నిరాశ‌ను మిగిల్చాయి. దీంతో కొత్త క‌థ ఎంపిక‌కు ఏకంగా ఏడాదిన్నర పాటు స‌మ‌యం తీసుకున్నార‌ని మాగురువు గారు నారాయ‌ణ రాజు గారు రివీల్ చేసారు.

ఈ స‌మ‌యంలో చిరంజీవి రెగ్యుల‌ర్ ఫార్మెట్ లో సినిమాలు చేస్తే ఇబ్బంది అవుతుంద‌ని భావించి మ‌ల‌యాళంలో హిట్ అయిన హిట్ల‌ర్ సినిమా త‌ట్టిందిట‌. అది కుటుంబ నేప‌థ్యం గ‌ల సినిమా. నిజానికి అది మెగాస్టార్ ఇమేజ్ కి త‌గ్గ సినిమా కాదు. అయినా చిరంజీవి ధైర్యం చేసారు. క‌థ‌లో నావెల్ పాయింట్ బాగా న‌చ్చి చేసారు. అయితే అప్ప‌టికే ఆ సినిమా హ‌క్కుల్ని ఎడిట‌ర్ మోహ‌న్ తీసుకున్నారు. హీరో కోసం ఎదురు చూస్తున్నారాయ‌న. ఆ స‌మ‌యంలో చిరంజీవికి పెద్ద పంచ్ ప‌డింది. ఆ సినిమా చేయ‌డానికి చిరంజీవి రెడీగా ఉన్నార‌ని మోహ‌న్ కి క‌బురు వెళ్లింది .

కానీ మోహ‌న్ ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్…ఆయ‌న ద‌గ్గ‌ర‌కి ఎవ‌రైనా రావాలి అనే స్వ‌భావం క‌ల‌వాడు. అలా చిరంజీవి శిఖ‌రంలా ఎదిగిన త‌ర్వాత ఆ ర‌క‌మైన ఇబ్బంది ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. చివ‌రికి ఆ కాంబినేష‌న్ అలా కుదిరింది. ముత్యాల సుబ్బ‌య్య ని ద‌ర్శ‌కుడిగా లాక్ చేసారు. కుటుంబ నేప‌థ్యం గ‌ల సినిమాలు చేయ‌డం ఆయ‌న‌కు కొట్టిన పిండిగా ఓ రికార్డు అప్ప‌ట్లో ఆయ‌న సొంతం. అలా ఆ ముగ్గురి కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన హిట్ల‌ర్ తెలుగునాట బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఆ త‌ర్వాత చిరంజీవి స్పీడ్ కు తిరుగులేకుండా పోయింది. నేడు ఆ లెజెండ‌రీ నటుడు పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ విశేషాల్ని స్మ‌రించుకున్నాం.