మెగాస్టార్ చిరంజీవి.. తన పుట్టిన రోజు సందర్భంగా తన 152 వ సినిమా ఆచార్య ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమా మొదటి సారి మెగాస్టార్, కొరటాల కాంబోలో వస్తోంది. దీంతో ఈ సినిమాకు విపరీతంగా హైప్ క్రియేట్ అయింది. కొరటాల శివ తీసిన ఏ సినిమా ఇప్పటి వరక ప్లాఫ్ కాలేదు. అందులోనూ ఆయన సినిమాల్లో ఓ మెసేజ్ ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఆయన సినిమాలు సూపర్ సక్సెస్ అవుతాయి.
ఇక చిరంజీవితో సినిమా అంటే కథ మామూలుగా ఉండకూడదు. కథ అదిరిపోవాలి. సినిమాకు కథే బలం అనే విషయం మోషన్ పోస్టర్ చూస్తేనే అర్థం అయిపోతోంది.
సినిమా దేవాదాయ భూములు, నక్సలిజం నేపథ్యంలో సాగుతుందట. మోషన్ పోస్టర్ బ్యాక్ డ్రాప్ లో ధర్మస్థలి అనే బోర్డును అందరూ చూసే ఉంటారు. అంటే సినిమా ధర్మస్థలి కేంద్రంగా సాగుతుందన్నమాట.
అంతవరకు బాగానే ఉంది కానీ.. ధర్మస్థలి అంటే ఏంటి? అసలు.. సినిమా కథకు, ఈ ధర్మస్థలికి లింక్ ఏంటి? అనే ప్రశ్న మెగా అభిమానుల్లో తొలిచింది. అయితే దానికి పెద్ద కథ ఉంది.
ఈ సినిమా మొత్తం దేవాలయాల మీద ఉండబోతోందట. ధర్మస్థలి అనేది హిందువుల పవిత్ర క్షేత్రం. అంటే గుడి. ఈ గుడి కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో నేత్రావది నది తీరంలో బెళ్తంగడి తాలుకాలో ఉంది.
ఈ ఆలయంలో శివుడు, మంజునాథుడు, అమ్మనవారు, చంద్రనాథ, కళారాలు అనే ధర్మ దైవాలు ఉంటాయట. ఇవి ధర్మ రక్షణ దైవాలు. అంతే కాదు.. కుమారస్వామి, కన్యాకుమారి లాంటి దైవాలు కొలువై ఉన్న ఆలయమే ధర్మస్థలి.
అయితే.. ఈ ఆలయ నిర్వహణ బాధ్యతను జైన్ మతస్థులు చూసుకుంటున్నారు. ఈ ఆలయానికి పూజలు, పునస్కారాలు మాత్రం హిందూ పూజారులు చేస్తారు.
ఈ ధర్మస్థలిలో హిందు దేవుళ్లంతా కొలువై ఉండటం.. మోషన్ పోస్టర్ లోనూ ధర్మస్థలి అని బ్యాక్ డ్రాప్ లో కనిపిస్తుండటంతో.. హిందూ దేవాలయాలను కాపాడటం కోసం ఓ వ్యక్తి ఎలా పోరాటం చేశాడు.. అనే స్టోరీ లైన్ తో సినిమా ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి కొరటాల శివ హిందూ దేవాలయాలను కాపాడటం అనే స్టోరీని తీసుకొని ధర్మస్థలిని బేస్ చేసుకొని ఈ సినిమాను తీస్తున్నాడన్నమాట.