మూడు రాజధానుల బిల్లు(పాలన వికేంద్రీకరణ)ను అడ్డుకోవడానికి ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అండ్ కో ఎలాంటి కుట్రలు పన్నుతున్నారో? ప‌్రజలు చూస్తున్నదే. దీనిలో భాగంగా పరిపాలన రాజధానిగా అవతరించబోయే విశాఖ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బ తీసేలా చంద్రబాబు నాయుడు అండ్ కో కంకణం కట్టుకుని పనిచేస్తోంది. మూడు రాజధానుల ప్రకటన వెలువడిన దగ్గర నుంచి చంద్రబాబు రేయింబవళ్లు అదే పనిమీద ఉన్నారు. తన సామాజిక వర్గానికే చెందిన అమరావతి రాజాధాని కావాలని చేయలేని ప్రయత్నాలు అంటూ ఏవీ లేవు. అమరావతి చుట్టు ప్రక్కల గ్రామాల రైతుల్ని రెచ్చగొట్టి ప్రభుత్వం మీదకు ఉసిగొల్పిన దగ్గర నుంచి ప్రపంచాన్ని కబళించేస్తోన్న వైరస్ ని సైతం లెక్క చేయకుండా రోడ్డెక్కారంటే బాబు ఏ స్థాయిలో శవ రాజకీయాలు చేస్తున్నారో? అద్దం పడుతోంది.
ఇటివలి కాలంలో విశాఖపట్ణంలో జరుగుతోన్న ప్రమాదాల నేపథ్యంలో ఆ పార్టీపై అధికార పక్షం నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదాలన్నింటిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తే దోషులెవరో తేలుతుందని విశాఖకి చెందిన ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. తాజాగా సోమవారం ఓ వార్త ప్రముఖ వెబ్ సైట్లలలో హాట్ టాపిక్ గా సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి నుంచి శ్రీకాకుళం వరకూ తీరం వరకూ సమద్రగ గర్భంలో 1000 కిమీ లోతుగా 300 కిమీ మేర ఓ చీలిక ఏర్పడిందని…దీని కారణంగా ఆ తీరం వెంబడి భూకంపాలు, సునామీలు వస్తాయని, విశాఖ కు ఇంకా ఎక్కువ ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఈనాడు, సహా కొన్ని ఆంగ్ల పత్రికల్లో కూడా వార్త వెలువడింది.
అందులో భూగర్భ పరీక్షలకు సంబంధించిన ఓ శాస్ర్తజ్ఞుడి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ రాని ఈ వార్త ఇప్పుడే ఎందుకు వచ్చిందా? అన్న అనుమానం ఉత్తరాంధ్ర వాసుల్లో వ్యక్తమైంది. ఇందులో టీడీపీ కుట్ర దాగి ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. తాజాగా కుట్రని వైకాపా నేతలు భగ్నం చేసారు. ఉత్తరాంధ్రకు సెక్రటేరియేట్ వస్తుందంటే చంద్రబాబుతో పాటు రామోజీరావుకి కూడా నిద్రపట్టలేదని, వీరిద్దరు చరిత్రలో ఉత్తరాంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారని వైకాపా ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ ధ్వజమెత్తారు. సోమవారం ఈనాడు పత్రికలో వచ్చిన వార్తను చూస్తే వారిద్దరి అక్కసు ప్రజలకు అర్ధమవుతుందన్నారు. ఈ వార్తను టీడీపీ నేతలు మరో రెండు ఆంగ్ల పత్రికల్లో కూడా తమ పలుకబడి ఉపయోగించి ప్రచురింపజేసారని తెలిపారు. సోమవారమే ఆయన ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసారు. అందులో ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి. ఎప్పుడో కోటి 60 లక్షల ఏళ్ల క్రితం, తూర్పు గోదావరి నుంచి శ్రీకాకుళం వరకూ సముద్రంలో చీలిక ఏర్పడిందని, 68 లక్షల ఏళ్లకు పూర్వం నుంచి 30 లక్షల ఏళ్ల పూర్వ వరకూ ఆ చీలికలో ఆలజడి ఉండేదని ఈనాడులో రాశారు. ఆ చీలిక వల్ల భవిష్యత్ లో ఎప్పుడైనా భూకంపాలు, సునామీలు రావొచ్చని ఒక ప్రొఫెసర్ తో ఉద్దేశ పూర్వకంగా చెప్పించారు. 30 ఏళ్ల క్రితమే ఆగిన అలజడి, ఇప్పుడు చంద్రబాబు దిగిపోవడంతో మళ్లీ రామోజీరావులో రేగిందని వెల్లడించారు.