దర్శకరత్న దాసరి నారాయణరావు మరణానంతరం ఇండస్ట్రీని ఆదుకునే సినీపెద్దలు ఎవరూ లేరనే ఆందోళన వ్యక్తమైంది. ఆ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి నేనున్నానంటూ ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆయన పెద్దన్న పాత్ర పోషించడం పరిశ్రమలో చాలా మందికి గిట్టడం లేదని తాజా సన్నివేశాలు చెబుతున్నాయి. కరోనా కష్ట కాలంలో సీసీసీ ట్రస్ట్ ని ప్రారంభించిన చిరంజీవి కార్మికుల్ని ఆదుకునే ప్రయత్నం చేయడం కొందరికి గిట్టలేదట. ఆయన వ్యక్తిగత ప్రాపకానికి తెర తీసారన్న విమర్శలు చేయడం హీటెక్కిస్తోంది.
ఇక మొన్నటికి మొన్న నటసింహా నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ యాక్టివిటీపై తీవ్రంగా దుమ్మెత్తిపోయడం అనంతరం సారీ చెప్పడం తెలిసిందే. అయితే సీసీసీ ప్రాపకానికి.. అనంతరం తెరాస అధినాయకుడు సీఎం కేసీఆర్ తో భేటీ విషయంలో బాలకృష్ణ మాత్రమే పరిశ్రమలో హర్టయ్యారా? అంటే.. పలువురు యూట్యూబ్ వేదికలపై ఇస్తున్న ఇంటర్వ్యూలు చూసినప్పుడు ఇది చాలా మందికి గిట్టని వ్యవహారం అని అర్థమవుతోంది.
తాజా వ్యవహారంలో కుల ప్రాపకం కూడా బయటపడడం హీటెక్కిస్తోంది. ఇక పరిశ్రమ అంటే చిరంజీవి ఒక్కరేనా? ఆయన ఎవరో కొందరిని వెంట పెట్టుకుని సీఎం కేసీఆర్ ని జగన్ ని కలుస్తారా? అంటూ ప్రశ్నించే స్వరాలు పెరిగాయి. అయితే ఇలాంటి కీలక సమయంలో కీలక శాఖల పెద్దల్ని చిరు ఎందుకుని పిలవలేదు? అంటూ స్వరం పెంచడంతో ప్రస్తుతం ఈ వివాదం రచ్చవుతోంది.
సమస్య వచ్చినప్పుడు ఇది ఉమ్మడి సమస్యగా చూడాలి. వ్యక్తిగతంగా వెళ్లకూడదు!! అని పలువురు విమర్శించడం చర్చకొచ్చింది. ఇక బాలయ్య ఒక్కరినే కాదు.. మోహన్ బాబు .. జీవితా రాజశేఖర్ సహా ఎందరినో విస్మరించారని ఇదంతా చిరంజీవి కావాలనే చేశారని బురద జల్లడం తాజాగా చర్చకొచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ.. రెబల్ స్టార్ కృష్ణం రాజు లాంటి సన్నిహితుల్నే చిరంజీవి పిలవలేదని ఓ నిర్మాత ఆరోపించడం చూస్తుంటే .. చిరంజీవి వ్యక్తిగత ప్రాపకానికి పాల్పడ్డాంటూ బురద జల్లే ప్రయత్నం జరుగుతోందన్న సందేహం రైజ్ అవుతోంది. ఛాంబర్ అధ్యక్షుడు పెద్ద అయిన నారంగ్ దాస్ ని పిలవక పోవడం పక్కన పెట్టేయడం వెనక మెగాస్టార్ ఆలోచన ఏమిటి? అన్న ప్రశ్న ప్రధానంగా హైలైట్ చేయడం తెలంగాణ -ఏపీ డివైడ్ ఫ్యాక్టర్ ని తిరిగి తెరపైకి తేవడం చూస్తుంటే చిరుపై సూటిగా రాజకీయ పరంగా బురద జల్లే ప్రయత్నం జరుగుతోందన్న సందేహం కలగక మానదు. ఇక కులం గోడు ఎక్కువగా వినిపించే పరిశ్రమలో మరోసారి కుల ప్రాపకం కూడా బయటపడడం హాట్ టాపిక్ గా మారింది. అయితే మెగాస్టార్ చిరంజీవి ఇలా విస్మరించడానికి కారణం ప్రస్తుత కొవిడ్ 19 సన్నివేశమేనా? అన్న పాయింట్ విస్మరించడం గమనించదగినదే.
అలాగే ఎన్టీఆర్ – ఏఎన్నార్- కృష్ణ వంటి ప్రముఖుల తర్వాత పుట్టుకొచ్చిన చిరంజీవి అంటూ ఆయన పెద్దరికాన్ని పూర్తిగా పలుచన చేసే విధంగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత వ్యాఖ్యానించడం .. తెలంగాణ ఏపీ అంటూ డివైడ్ ఫ్యాక్టర్ ని హైలైట్ చేయడం చూస్తుంటే చిరుపై ఏ రేంజులో దుమ్మెత్తిపోసే ప్రయత్నం జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ రెస్పాండ్ అయినట్టు కృష్ణ కానీ.. కృష్ణంరాజు కానీ జీవిత రాజశేఖర్ కానీ స్పందించనే లేదు. మోహన్ బాబు అయితే చిరుతో ఎంతో క్లోజ్ గా ఉంటున్నారు. వీళ్లెవరికీ లేనిది అంతగా సినిమాలు తీయని.. ఫిలింఛాంబర్ రాజకీయాల్లో ఆరితేరిన నిర్మాత ప్రశ్నించడం వెనక ఏదైనా గూడుపుటానీ ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.