(ధ్యాన్ )
మైత్రీ మూవీస్ ఇప్పుడు బిజీ నిర్మాణ సంస్థ. ఓ వైపు స్టార్ హీరోలతో, మరోవైపు మీడియమ్ రేంజ్ హీరోలతో సినిమాలు చేస్తూనే ఉంది. తాజాగా ఈ లిస్టులోకి బన్నీ రానున్నారు. `గీత గోవిందం` సినిమాకు దర్శకత్వం వహించిన పరశురామ్ దర్శకత్వంలో బన్నీ హీరోగా మైత్రీ మూవీస్‌లో సినిమా ప్రారంభం కానుందని వినికిడి. ఇటీవల పరశురామ్ కథను కూడా లీలగా బన్నీకి చెప్పారట. కథ నచ్చి డెవలప్ చేయమన్నారట బన్నీ. సో పాటలతోనూ, టీజరతోనూ పేరు తెచ్చుకున్న `గీతగోవిందం` బాక్సాఫీస్ దగ్గర కూడా హిట్ కొడితే తప్పకుండా పరశురామ్‌తో కలిసి ట్రావెల్ చేయాలనేది బన్నీ కోరిక. పరశురామ్ డేట్స్ గీతా ఆర్ట్స్ లోనూ ఉన్నాయి. అయితే సొంత బ్యానర్‌లో కాకుండా పరశురామ్ సినిమాను మైత్రీ మూవీస్ లో చేయాలన్నదే బన్నీ నిర్ణయమట. ఇందులో నాయికగా కూడా రష్మిక పేరే వినిపిస్తోంది. విజయ్ దేవరకొండతో రెండు సినిమాల ఛాన్సులు కొట్టేసిన రష్మిక `దేవదాస్`లో నానితో నటిస్తోంది. బన్నీ సరసన కూడా సూటవుతుందని టాక్. బన్నీకి పరశురామ్ చెప్పిన కథలో ఫ్యామిలీ ఎమోషన్స్ మెండుగా ఉన్నాయట. ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. ఓ హీరోయిన్‌గా రష్మిక పేరు పరిశీలిస్తున్నట్టు తెలిసింది. అయితే ఈ వార్తలో నిజానిజాలు తెలియాలంటే ఈ నెల 15 వరకు ఆగాల్సిందే మరి.