పుష్ప‌రాజ్ ఏక్ నిరంజ‌న్ లాంటోడా?

అల్లు అర్జున్ పాన్ ఇండియా ఫిల్మ్ `పుష్ప‌`

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప టైటిల్ తో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇదొక స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్. చిత్తూరు అడ‌వుల నేప‌థ్యంలో సాగే స్టోరీ. ఇందులో బ‌న్నీ పుష్ప‌రాజ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఎర్ర చంద‌నం బోర్డ‌ర్ దాటించే ఓ స్మ‌గ్ల‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఇప్ప‌టికే బ‌న్నీ లుక్ కూడా రివీల్ చేసి సుకుమార్ విష‌యం చెప్ప‌క‌నే చెప్పేసాడు. సినిమా ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా అన్నిర‌కాల క‌మ‌ర్శియ‌ల్ ఎలిమెంట్స్ తో క‌థ సాగుతుంద‌ని తెలుస్తోంది. ఇందులో మెయిన్ గా ఎమోష‌న్ హైలైట్ గా ఉంటుంద‌ని ఇప్ప‌టికే లీకులందుతున్నాయి.

అలాగే ఈ సినిమా లో బ‌న్నీ పాత్ర ఏక్ నిరంజ‌న్ ని పోలి ఉంటుందిట‌. అమ్మా లేదు..అయ్యా లేడు. అక్కా లేదు..తంబీ లేకుండా ఏక్ నిరంజ‌న్ లో లీడ్ చేసే క్యారెక్ట‌ర్ అట‌. ఏ రోజు సంపాద‌న ఆరోజు ఖ‌ర్చు అయిపోవాల్సిందేన‌ట‌. పొద్దుట నుంచి సాయంత్రం వ‌ర‌కూ ఆవార‌గా తిర‌గ‌డం…చీక‌టి ప‌డితే ఎర్ర చంద‌నం రాష్ర్టాలు దాటించ‌డం వంటి స‌న్నివేశాలు సినిమా హైలైట్ గా ఉంటాయ‌ని సోర్సెస్ చెబుతున్నాయి. సుకుమార్ వైవిథ్యమైన క‌థ‌, క‌థ‌నాల‌తో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా మ‌ల‌చ‌నున్నార‌ని స‌మాచారం. అలాగే లాక్ డౌన్ కార‌ణంగా స‌మ‌యం దొర‌క‌డంతో స్ర్కిప్ట్ కి మెరుగులు దిద్దుతున్నాడుట‌.

ఏ సినిమాకైనా ఏమోషన్ కీల‌కం కాబ‌ట్టి పుష్ప‌లో కూడా కావాల్సినంత ఎమోష‌న్ ఉంటుందిట‌. ప్రస్తుతం ఉన్న స‌మ‌యాన్ని ఆ స‌న్నివేశాల‌కు సంబంధించి ఏమోష‌న్ ని తెలుగు ఆడియ‌న్స్ కి ఎలా ఎక్కిస్తే వ‌ర్కౌట్ అవుతుంది! అన్న దానిపై త‌న రైటింగ్ టీమ్ తో క‌లిసి వ‌ర్క్ చేస్తున్నాడుట‌. రంగ‌స్థ‌లం హిట్ అవ్వ‌డానికి కార‌ణం ఏమోష‌న్ అన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు పుష్ప‌లో అంత‌కు రెండిత‌లు ఏమోష‌న్ ని న‌మ్ముకునే సుకుమార్ బ‌రిలోకి దిగుతున్నాడ‌ని….స్ర్కిప్ట్ రిస్క్ అయినా..ఏమోష‌న్ పై నే ఎక్కువ‌గా న‌మ్మ‌కం పెట్టుకున్న‌ట్లు చెబుతున్నారు.