(ధ్యాన్)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తదుపరి సినిమా ఏమిటనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. రీసెంట్‌గా గీత గోవిందం ఆడియో వేడుకలో బన్ని ఇదే విషయాన్ని చెప్పాడు. మరికొన్ని రోజులు ఆగితే కానీ క్లారిటీ రాదని తేల్చేశాడు. అందుకు కారణం బన్ని కొత్త సినిమాను డెబ్యూ డైరెక్టర్‌తో చేయబోతున్నాడట. పొలిటికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో సినిమా ఉంటుందని సమాచారం. ఇప్పటి వరకు బన్ని చేయని పాత్ర అని చెప్పొచ్చు. డైరెక్టర్ చెప్పిన లైన్ నచ్చడంతో బన్ని పూర్తి స్క్రిప్ట్ డెవలప్ చేయమని చెప్పాడట.
దువ్వాడ జగన్నాథమ్, నా పేరు సూర్య సినిమాలు బన్ని కమర్షియల్ సక్సెస్‌లే అయినా అనుకున్నంత పేరు తెచ్చిపెట్టలేదు. దాంతో బన్ని ఈ సారి స్క్రిప్ట్ సెలక్షన్స్ విషయంలో తొందర పడకూడదని అనుకుంటున్నాడు. అందుకనే అచి తూచి స్క్రిప్ట్స్‌ను ఎంచుకుంటున్నాడు. ఈసారి బన్నిలాంటి హీరో డెబ్యూ డైరెక్టర్‌తో పనిచేయడానికి రెడీ అవుతుండటం.. కొత్త కాన్సెప్ట్‌ల కోసం హీరోలు ఎంత అతృతగా ఉన్నారో తెలుస్తూనే ఉంది.