త్రివిక్రమ్ సినిమాలో రొమాన్స్ కంటే కథ కి ప్రాధాన్యం ఉంటుంది.కానీ ఈ సినిమాలో ఘాటుగా రెండు నుంచి మూడు సన్నివేశాలు ఉన్నాయి తప్పక పెట్టాల్సి వస్తోందిట.
నిజానికి ఆసన్నివేశాలు ముందు తీసేయాలనుకున్నారుట. కానీ బన్నీ తీసేస్తే కథలో ఫీల్ మిస్ అవుతుందని కన్వెన్స్ చేసాడుట. దీంతో ఆయన మాట కాదనలేక త్రివిక్రమ్ కాంప్రమైజ్ అయినట్లు సమాచారం.
తదుపరి జరగబోయే షెడ్యూల్ లో ముందుగా ఆ సన్నివేశాలనే చిత్రీకరించనున్నారుట. అయితే అవి ఒరిజినల్ గా షూట్ చేస్తారా? గ్రాఫిక్స్ తో మ్యానేజ్ చేస్తారా? అన్న దానిపై మాత్రం సరైన క్లారిటీ లేదు.
ఆ సీన్ చూడటానికి రియల్ గా నటించారనిపిస్తుంది. కానీ అదంతా మేకప్ మాత్రమే. కానీ ఇప్పుడు హీరోలంతా లిప్ లాక్ ల్లో ఒరిజినల్ గానే నటిస్తున్నారు. హీరోయిన్ల నుంచి అభ్యంతరాలు ఉండటం లేదు కాబట్టి దర్శకులకు పని ఈజీ అవుతుంది.
మరి బన్నీ కోరి పెట్టించాడు కాబట్టి వాస్తవికంగా షూట్ చేస్తారా? గ్రాపిక్స్ తో మ్యానేజ్ చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది. బన్నీ-పూజ గతంలో డీజే లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య కెమిస్ర్టీ సమస్య కూడా ఉండదు.