బన్నీ  సినిమాలో హీరోయిన్ ఈవిడేనా !

వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో బన్నీ హీరోగా తెరకెక్కనున్న సినిమా ‘ఐకాన్‌’. దిల్‌రాజు నిర్మాత. ‘ఆర్య’, ‘పరుగు’, ‘డీజే: దువ్వాడజగన్నాథమ్‌’ తర్వాత దిల్‌రాజు, బన్నీ కాంబినేషన్‌లో వస్తోన్న నాలుగో సినిమా.

ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం దర్శక, నిర్మాతలు రాశీని సంప్రదించారని ప్రచారం జరుగుతోంది. స్క్రిప్టు ఆమెకు నచ్చిందని, నటించేందుకు ఆసక్తి చూపారని. ‘ఐకాన్‌’ సినిమాకు ఆమె డేట్స్‌ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.

అయితే దీనికి సంబంధించి చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ‘ఐకాన్‌’ప్రీ-ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.