ఇప్పుడు తెలుగు తమిళ భాషల్లో మంచి జోరు మీద వున్న హీరోయిన్ రాశి ఖన్నా. తెలుగులో తన చివరి చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ ప్లాప్ అయినప్పటికీ డిమాండ్ ఏమాత్రం తగ్గకుండా కెరీర్ కొనసాగిస్తోంది ఈ ఢిల్లీ భామ.
తన మనస్సులో భావాలని సోషల్ మీడియాలో పంచుకొనే రాశి ఖన్నా తాజాగా ఇంస్టాగ్రామ్ ద్వారా తన అభిమానులకు ఒక సందేశం పంపింది ” జీవితం శాశ్వతం కాదు, అందుకే మీరు ఎవరినన్నా ప్రేమిస్తే వెంటనే చెప్పేయండి, చెప్పేసి సంతోషంగా వుండండి” అంటూ తన ప్రేమను తన ఫాలోయర్స్ కి పంపింది రాశి.