జర్నలిస్ట్ శ్వేతారెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. నగరంలోని స్థానిక వీజేఎఫ్‌లో మహిళా సంఘాల నేతలతో కలిసి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మాట్లాడిన శ్వేతా రెడ్డి. బిగ్ బాస్ షోలో చీకటి కోణాలున్నాయని ఆరోపించారు. మహిళలపై అసభ్యకరమైన ప్రశ్నలు వేస్తున్నారని.. బిగ్ బాస్ హౌసా? బ్రోతల్ హౌసా? అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. రియాలిటీ షో ముసుగులో సెక్స్, ముద్దుల కోసం మాట్లాడుతున్నారని విమర్శించారు. తమ బాసుని ఎట్లా సంతృప్తిపరుస్తారని అడగడం ఏమిటని వ్యాఖ్యానించారు. చాలామంది ఆరోపిస్తున్నట్లు తాము పబ్లిసిటీ కోసమో, డబ్బుల కోసమో చేయడం లేదని.. పోరాటానికి మహిళా సంఘాల నేతల మద్దతు కూడా ఉందన్నారు. బిగ్ బాస్ రియాల్టీ షోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. బిగ్‌బాస్ కో ఆర్డినేటర్ల ప్రవర్తనపై నాగార్జున స్పందించాలని డిమాండ్ చేశారు.ఇంత వరకు ఎలాంటి స్పందన లేదు మరి బిగబాస్ నిర్వహకులు నుంచి.