ఇప్పుడు హామీలివ్వ‌డం 30 ఇయ‌ర్స్ పృథ్వీ వంతు

ద‌ళారుల్ని త‌రిమి కొట్టాలి

తెలుగు సినిమా రంగంలో ఆర్టిస్టులు లేదా సినిమా 24 శాఖ‌ల్లో కార్మికుల‌ మ‌నుగ‌డ‌కు ఎలాంటి ముప్పు లేకుండా ఉండాలంటే ఏం జ‌ర‌గాలి? టాలీవుడ్ ప‌చ్చ‌గా ఉండాలంటే ఎక్కువ మంది కోరుకుంటున్న‌ది ఏది? అంటే .. నిరభ్యంతంరంగా టాలీవుడ్ నుంచి ద‌ళారీ వ్య‌వ‌స్థ‌ను- కోఆర్డినేట‌ర్ల వ్య‌వ‌స్థ‌ను- మ‌ధ్య‌వ‌ర్తుల్ని త‌రిమేయాల‌న్న అభిప్రాయం అన్ని శాఖ‌ల కార్మికుల్లోనూ స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది. అయితే అందుకు కార‌ణం ఏమిటి? అంటే అన్ని రంగాల్లోనూ ఉన్న‌ట్టే క‌ళారంగంలోనూ ద‌ళారీ వ్య‌వ‌స్థ పాగా వేసి ఉంది. ప‌ర్సంటేజీల పేరుతో కార్మికుల క‌ష్టాన్ని దోచుకు తింటోంది ఈ వ్య‌వ‌స్థ‌. ఇది ఎంత ప్ర‌మాద‌క‌రంగా మారింది అంటే.. `క‌ష్టం ఒక‌డిది.. సోకులు ఇంకొక‌డివి` అన్న చందంగా ఉందిక్క‌డ‌. అడ్డ‌గోలుగా ఆర్టిస్టుల నుంచి కార్మికుల నుంచి దోచుకు తినే వ్య‌వ‌స్థ‌లు దారుణంగా విస్త‌రించి ఉన్నాయ‌న్న అభిప్రాయం మెజారిటీ వ‌ర్గాల నుంచి వ్య‌క్తం అవుతోంది.

ప్ర‌తిసారీ మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌లు లేదా తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్టుల సంఘం (టీఎంటీఏయు) ఎన్నిక‌ల సంద‌ర్భంలో .. ఈ ద‌ళారీ వ్య‌వ‌స్థ‌పై విస్త్ర‌తంగా చ‌ర్చ సాగుతోంది. ప‌రిశ్ర‌మ‌లో ఉన్న‌ వంద‌లాది ఆర్టిస్టుల్లో ద‌ళారీలు కం కోఆర్డినేట‌ర్ వ్య‌వ‌స్థ‌పై తీవ్ర‌ వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతోంది. ఈ నెల 25న 730 మంది ఆర్టిస్టులు స‌భ్యులుగా ఉన్న‌ టీఎంటీఏయు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో 30 ఇయ‌ర్స్ పృథ్వీ అలియాస్ పృథ్వీ రాజ్ ప్యానెల్ పోటీ బ‌రిలో ఉంది. పృథ్వీ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేస్తున్నారు. అంతేకాదు.. పృథ్వీ స్ప‌ష్టంగా కొన్ని హామీల్ని ఇస్తున్నారు. తెలుగు సినిమా రంగం నుంచి ద‌ళారీ వ్య‌వ‌స్థ లేదా కోఆర్డినేట‌ర్ వ్య‌వ‌స్థ‌ను నాశ‌నం చేయ‌డ‌మే త‌న ధ్యేయం అని ఆయ‌న ప్ర‌క‌టించారు. అలాగే ఆర్టిస్టుకు అవ‌కాశాలు ద‌క్కేలా ఒక ప్ర‌త్యేక‌మైన వ్య‌వ‌స్థ‌ను రూపొందిస్తామ‌ని పృథ్వీ అన్నారు. ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖుల‌తో సంప్ర‌దింపులు చేయ‌డం ద్వారా ఆర్టిస్టుల‌కు మ‌రింత‌గా అవ‌కాశాలు పెరిగేలా చేస్తామ‌ని హామీ ఇచ్చారు.

<

p style=”text-align: justify”>ఇక ప్ర‌త్య‌ర్థి ప్యానెల్ త‌ర‌పు నుంచి అధ్య‌క్షుడిగా పోటీ చేస్తున్న‌నాగేంద్ర శ‌ర్మ సైతం యూనియన్ శ్రేయస్సు అభివృద్ది కోసం కృషి చేస్తామ‌ని.. ముఖ్యంగా ద‌ళారీ వ్య‌వ‌స్థ నిర్మూల‌న‌కు కృషి చేస్తాన‌ని ప్రామిస్ చేశారు. అంతే కాకుండా యూనియన్ శ్రేయస్సు దృష్ట్యా ఫెడరేషన్ కు అనుసంధానం చేసి కళాకారులకి రావాల్సిన అన్ని సదుపాయాల కోసం కృషి చేస్తామ‌ని స్పాన్సర్స్ సహకారం తో వీలైనంత తొందర్లో యూనియన్ ఆఫీస్ ను సొంతంగా ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. యూనియన్ సభ్యుల రక్షణ, అవకాశాల నిమిత్తం ఒక స్క్వాడ్ కమిటీ ని ఏర్పాటు చేసి ఆ కమిటీతో దర్శక నిర్మాతల అందరినీ కలిసి యూనియన్ సభ్యులందరికీ లబ్ది చేకూర్చే ప్ర‌య‌త్నం చేస్తామ‌ని.. సభ్యులలో కళ నైపుణ్యం మెరుగులు దిద్దడం కోసం ఉచితంగా యాక్టింగ్ & డాన్సింగ్ క్లాసులు పెట్టి వారితో వివిధ ప్రోగ్రాం లు చేసి తద్వారా వచ్చిన డబ్బుతో యూనియన్ సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామ‌ని ప్రామిస్ చేశారు. ఆ సంక్షేమ నిధితో మన యూనియన్ లో అనారోగ్యం తో బాధపడే పేద కళాకారుల సహాయార్థం వినియోగిస్తామని, వివిధ సచంధ సంస్థలను సంప్రదించి ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహించాల్సి ఉంద‌ని తెలిపారు.వీలైనంత త్వరలో కోఆర్డినేటర్ వ్యవస్థని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తామ‌ని ప్రామిస్ చేశారు. దీనిని బ‌ట్టి ఇండ‌స్ట్రీలో కోఆర్డినేట‌ర్ వ్య‌వ‌స్థ వ‌ల్ల ఆర్టిస్టుల‌తో పాటు ప‌లు రంగాల్లో ఎలాంటి డ్యామేజ్ జ‌రుగుతోందో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ కోఆర్డినేట‌ర్ల దాష్ఠీకం ఒక్కోసారి మ‌రీ శ్రుతి మించుతోంద‌న్న ఆవేద‌న ఆర్టిస్టుల్లో వ్య‌క్తం అవుతోంది.