బ్రేకింగ్ న్యూస్ : మహేష్ బాబు మాతృమూర్తి కన్నుమూత.!

మరోసారి ఈ తెల్లవారు తోనే తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర మరో షాకింగ్ ఉదయం ఇది అని చెప్పాలి. గత కొన్ని రోజులు కితమే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెదనాన్న టాలీవుడ్ దిగ్గజ నటులు అయినటువంటి రెబల్ స్టార్  గారి మరణంతో టాలీవుడ్ అంతా విస్మయానికి లోను కాగా..

ఇప్పుడు మరో షాకింగ్ సంఘటనతో ఈ ఉదయం మొదలైంది. ఇప్పుడు మన తెలుగు సినిమా సూపర్ స్టార్ కృష్ణ భార్య అలాగే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి అయినటువంటి శ్రీమతి ఇందిరా దేవి గారు ఇక లేరు అని వార్తలు బయటకి వచ్చాయి.

అయితే మరిన్ని డీటైల్స్ లోకి వెళ్లినట్టు అయితే ఈరోజు తెల్లవారు 4 గంటల సమయంలో ఇందిరా దేవి తన తుది శ్వాస విడిచారు అట. అయితే దీనికి కారణం వయసుకు సంబంధించి సమస్యల వల్లనే అని తెలుస్తుంది. కానీ సరైన కారణం అయితే ఇంకా తెలియరాలేదు.

ఏది ఏమైనప్పటికీ మాత్రం ఇలా టాలీవుడ్ లో వెంట వెంటనే విషాదాలు చోటు చేసుకోవడం అనేది షాకింగ్ అని చెప్పాలి. మరి ఈ సమయంలో అయితే అనేక మంది సినీ తారలు మహేష్ మరియు ఘట్టమనేని కుటుంబీకులకు ధైర్యం చెప్తూ విచారం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ వార్తతో మహేష్ అభిమానులు కూడా ఎంతో చింతిస్తున్నారు.