ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందానికి గుండె ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఆయన కుమారుడు, నటుడు రాజా గౌతమ్ ని మీడియా వారు కలిసి..వివరాలు అడిగితే ఆయన స్పందించాడు. తన తండ్రి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని చెప్పారు.
గౌతమ్ మాట్లాడుతూ….కొన్ని నెలలుగా ఛాతీలో అసౌకర్యంగా ఉందని అనిపించడంతో నాన్నగారిని హైదరాబాద్ లో హార్ట్ స్పెషలిస్ట్ కి చూపించాం. వారి సలహా మేరకు గుండె ఆపరేషన్ చేయించాలని నిర్ణయించాం. దేశంలో బెస్ట్ అనిపించుకున్న ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో సోమవారం నాడు గుండె ఆపరేషన్ చేయించామంటూ విరరణ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఐసీయు నుండి సాధారణ గదికి మార్చారని చెప్పారు.
అలాగే ‘నాన్నగారికి ఆపరేషన్ జరిగిందని తెలిసి అభిమానులు, స్నేహితులు, సినీ ప్రముఖులు అందరూ ఆయన ఆరోగ్య పరిస్ధితి గురించి వాకబు చేయడం మొదలుపెట్టారు. అందరి ప్రేమాభిమానాల కారణంగా ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని’ గౌతం అన్నారుర. ప్రస్తుతం బ్రహ్మానందంతో పాటు ఆయన ఇద్దరు కుమారులు గౌతం, సిద్ధార్థ్ లు ముంబైలోనే ఉన్నారు.
హాస్య బ్రహ్మాగా పేరుపొంది, ఒక దశాబ్దం పాటు దాదాపు విడుదలైన ప్రతి తెలుగు సినిమాలోనూ కనిపించి నవ్వుల్ని పండించారు బ్రహ్మానందం. ఆయన కు ఈ మధ్య సినిమా అవకాశాలు బాగా తగ్గాయి. కొన్ని సినిమాల్లో మాత్రమే ఆయన కనిపిస్తున్నారు. దర్శకులు, రచయితలు ఆయన కోసం ప్రత్యేకంగా పాత్రలు రాయడం తగ్గించేశారు . రీసెంట్ గా ఎన్టీఆర్ కధానాయకుడులో ..రేలంగి పాత్రలో కనిపించారు. దాదాపు వెయ్యికు పైగా సినిమాల్లో నటించిన ఆయన సౌతిండియాలో టాప్ కమిడియన్ గా వెలిగారు.