(సూర్యం)
దాదాపు మూడు దశాబ్దాలుగా తెలుగు సినిమాను ఏలిన బ్రహ్మానందం.. సుమారు వెయ్యికిపైగా చిత్రాలతో గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో స్థానం
పొందారు. అయితే, ఇటీవల ఆయన హవా బాగా తగ్గింది. కొత్త నీరు వచ్చి పాత నీటిని ప్రక్కకు నెట్టేసింది. ఆయన ఈ మధ్యన వస్తున్న సినిమాల్లో చాలా తక్కువగా కనిపిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయన బుల్లితెరకు ట్రాన్ఫర్ అయ్యారు.
స్టార్ మాలో ఈ మధ్యనే ప్రారంభం అయ్యిన ‘ద గ్రేట్ తెలుగు లాఫర్ చాలెంజ్’ షో లో ఆయన న్యాయనిర్ణేతగా కనిపిస్తునున్నారు. అయితే ఈ పోగ్రాం అనుకున్నంతగా క్లిక్ అవ్వలేదు. దాంతో ఆయన నిరాశపడినట్లున్నారు. ఈ నేపధ్యంలో తమ షోకు పోటీగా జబర్దస్త్ ని భావిస్తూ కొన్ని కామెంట్స్ చేసారు. ఆ కామెంట్స్ ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారాయి.
బ్రహ్మీ మాట్లాడుతూ.. ”చక్కగా అందరికీ ఆనందాన్ని కలిగించే కామెడీ ప్రోగ్రామ్ మాది.. ఏ రకమైన ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా అందరూ టీవీ ముందు కూర్చొని చూడాలని అనుకున్నాం. కొంచెం మనం వెజిటేరియన్ తినడం అలవాటు చేసుకుంటే నాన్ వెజిటేరియన్ తినడానికి పెద్దగా ఇంటరెస్ట్ చూపించం.. జెనరెల్ గా అదే జరుగుతుంటుంది.దాన్ని అలవాటు చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది..” అంటూ కామెంట్స్ చేశారు. ఆయన ఉద్దేశ్యంలో ఇక్కడ నాన్ వెజిటేరియన్ అంటే జబర్దస్త్ వంటి షోలని పరోక్షంగా సెటైర్స్ వేసాడు బ్రహ్మీ.