వైరల్ వార్త : బ్రహ్మానందం పై బన్నీ ఫన్నీ ట్వీట్ !

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందానికి ఆ మధ్యన గుండె ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిన ముంబైలోని ‘ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్’లో గత నెల 14న ఆయనకు ఈ ఆపరేషన్‌ చేసారు. అయితే ఆపరేషన్ జరిగిన తర్వాత ఆయన పరిస్దితి ఎలా ఉందంటూ అభిమానులు కంగారు పడుతున్నారు.

ఈ నేపధ్యంలో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న బ్రహ్మానందాన్ని స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ పరామర్శించారు. ఆయన మునుపటి లా ఉషారుగా సినిమాలు చేయాలని, మరింత కాలం మనల్ని నవ్వించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ లో బ్రహ్మానందం ఉషారుగా ఉన్నారు. బన్ని ఇంతకీ ట్వీట్ లో ఏ రాసారో చూడండి.

హాస్య బ్రహ్మాగా పేరుపొంది, ఒక దశాబ్దం పాటు దాదాపు విడుదలైన ప్రతి తెలుగు సినిమాలోనూ కనిపించి నవ్వుల్ని పండించారు బ్రహ్మానందం. ఆయన కు ఈ మధ్య సినిమా అవకాశాలు బాగా తగ్గాయి. కొన్ని సినిమాల్లో మాత్రమే ఆయన కనిపిస్తున్నారు. దర్శకులు, రచయితలు ఆయన కోసం ప్రత్యేకంగా పాత్రలు రాయడం తగ్గించేశారు . రీసెంట్ గా ఎన్టీఆర్ కధానాయకుడులో ..రేలంగి పాత్రలో కనిపించారు. దాదాపు వెయ్యికు పైగా సినిమాల్లో నటించిన ఆయన సౌతిండియాలో టాప్ కమిడియన్ గా వెలిగారు.

ఇక బన్ని విషయానికి వస్తే…నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత లాంగ్ గ్యాప్‌ తీసుకున్న అల్లు అర్జున్ త్వరలో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో బన్నీ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు. బ్రహ్మానందం కూడా ఈ సినిమా చేసే అవకాసం ఉంది.