బోయపాటికు మరో చేదు అనుభవం

సినిమా హిట్ అయితే ఇండస్ట్రీ అంతా ఆ దర్శకుడుని, హీరోని భుజాల మీద మోస్తుంది.అదే ప్లాఫ్ అయితే ఓవర్ నైట్ లో సీన్ మారిపోతుంది. చివరకు ఇచ్చిన అడ్వాన్స్ లు కూడా వెనక్కి ఇచ్చేయాల్సిన పరిస్దితి వచ్చేస్తుంది. ఇప్పుడు బోయపాటి శ్రీనుది అదే పరిస్దితి.

రామ్ చరణ్ తో తీసిన వినయ విధేయరామ చిత్రం డిజాస్టర్ కావటంతో బోయపాటి పరిస్దితి చాలా దారుణంగా మారిపోయింది. కొత్త నిర్మాతలు అడ్వాన్స్ లు ఇవ్వటం మాట దేవెడెరుగు…ఆల్రెడీ ఇచ్చిన వాళ్లు వెనక్కి తీసేసుకుంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సైతం అడ్వాన్స్ వెనక్కి తీసేసుకున్నట్లు సమాచారం.

అయితే ఇది ఇప్పటి విషయం కాదు..ఆరేళ్ల క్రితం ఇచ్చిన అడ్వాన్స్ ..మైత్రీ మూవీస్ వారు తమ తదుపరి చిత్రం కోసం బోయపాటితో అడ్వాన్స్ ఇచ్చి ఎగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. అయితే ఈ సినిమా రిజల్ట్ చూసిన మైత్రీ వారు…ఇక బోయపాటి భవిష్యత్ లో కూడా సినిమా వద్దనుకున్నారో ఏమో …అడ్వాన్స్ వెనక్కి పంపమని ప్రెజర్ పెట్టారట. మొదట్లో లైట్ తీసుకున్నా…లీగల్ గా ఎప్రోచ్ అయ్యేటట్లు ఉన్నారని,కోర్టుకు వెళ్ళబోతున్నారని తెలుసుకుని..అడ్వాన్స్ ని వెనక్కి ఇచ్చేసినట్లు సమాచారం.