‘వినయ విధేయరామ’ చిత్రం డిజాస్టర్ కావటం బోయపాటి కెరీర్ ని పూర్తిగా వెనక్కి లాగేసింది. తన కెరీర్ లో ఏ సినిమాకు రానంత బ్యాడ్ నేమ్ ఈ ఒక్క సినిమా తెచ్చిపెట్టింది. దానికితోడు నిర్మాత డివివి దానయ్యతో తగువు పెట్టుకోవటం కూడా బోయపాటికి ఓ వర్గానికి దూరం చేసింది. ఇప్పుడు బోయపాటి ముందున్న ఒకే ఒక ఆప్షన్ బాలయ్యతో చేసి హిట్ కొట్టడం.
అయితే బాలయ్య డేట్స్ ఇస్తానన్నాడు హ్యాపీ. వెంటనే ప్రారంభం చేద్దామంటే ఎలక్షన్స్ అడ్డొచ్చాయి. బాలయ్య ఎలక్షన్ క్యాంపైన్ లోనూ, బోయపాటి …పార్టీకి యాడ్స్ తయారు చేయటంలోనూ బిజీ అయ్యారు. ఇప్పుడు ఇద్దరూ ఫ్రీ అయ్యారు.
ఈ నేఫద్యంలో స్క్రిప్టు ఫైనల్ నేరేషన్ ని బాలయ్యకు వినిపించటం, లాంచింగ్ డేట్ ఫైనల్ చేసుకుని షూటింగ్ మొదలెట్టడమే పెండింగ్ లో ఉంది. ఈ మేరకు బోయపాటి ప్రిపరేషన్స్ మొదలెట్టేసారట. ఎంత త్వరగా హిట్ ఇచ్చి వినయ విధేయరామ ప్లాఫ్ నుంచి బయిటపడదామా అని వెయిట్ చేస్తున్నట్లు సమాచారం.
తాను టీడీపి కు చేసిన యాడ్స్ కు కూడా మంచి స్పందన రావటం ప్లస్ అయ్యిందని సమాచారం. రెండు వారాల్లో అఫీషియల్ ప్రకటన వస్తుందని చెప్తున్నారు. అలాగే సంక్రాంతి 2020 కు ఈ సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.