ముగ్గురమ్మల రూపకల్పనలో బోనాల పాట

ముగ్గురమ్మల రూపకల్పనలో బోనాల పాట

తంగెళ్ళ శ్రీదేవి రెడ్డి, ఎం.ఎం. శ్రీలేఖ, మోహన భోగరాజు ఈ ముగ్గురు బోనాల పాటకు రూపకల్పన చెయ్యడం విశేషం . తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగను ఎంతో విశిష్టత ఉంది . నగర , పట్టణ , పల్లె అనే తేడా లేకుండా మహిళలంతా పాల్గొని చేసుకునే సంప్రదాయ పండుగ బోనాలు . తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ పండుగను ప్రోత్సహిస్తున్నది .

తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ వచ్చిందంటే ఒకటే సందడి . తరతరాల ఆచారం , సంస్కృతి స్త్రీశక్తి రూపంలో పండుగలా జరుపుకోవడం తెలంగాణ ప్రజల సంప్రదాయం ,అలాంటి స్త్రీశక్తి ఆరాధనకు ప్రతిరూపమే ఈ బోనాల పండగ. సీనియర్ పాత్రికేయులు పొన్నం రవిచంద్ర సమర్పణలో సుపద క్రియేషన్స్ బ్యానర్ పై బోనాల పాట వీడియో విడుదల, మై టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి పార్థసారధి పాటను, ఛానల్ ను ఆవిష్కరించారు . అయితే ఈ పాటను ముగ్గురు మహిళలు కలసి రూపొందించడం అభినందించతగ్గ విషయమని సాంస్కృతిక సంచాలకులు మామిడి హరికృష్ణ అన్నారు .

ఈ బోనాల పాటను తంగెళ్ల శ్రీదేవి రచించారు . శ్రీమతి శ్రీలేఖ సంగీతాన్ని సమకూర్చారు . శ్రీమతి మోహన భోగరాజు గానం చేశారు సోమవారం రోజు హైద్రాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో టీ.యు.డబ్ల్యూ.జె. రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లె రవికుమార్, బోనాల పాట దర్శకుడు కత్తి చేతన్, గీత రచయిత తంగెళ్ళ శ్రీదేవి రెడ్డి, సంగీత దర్శకురాలు ఎం.ఎం. శ్రీలేఖ, గాయని మోహన భోగరాజు, సినిమాటోగ్రాఫర్ , ఎడిటర్ ఉదయ్  పాల్గొన్నారు.