బుల్లితెర మీద ప్రసారమైన అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ రియాలిటీ షో. ఎన్నో సంవత్సరాలుగా బుల్లితెర మీద ప్రసారమవుతున్న ఈ రియాలిటీ షో ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక తొందరలోనే బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం కానంది. ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించిన ప్రోమో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీజన్ లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా పాల్గొనే అవకాశం కల్పించారు. అందువల్ల ఈ సీజన్ 6 కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు సెప్టెంబర్ 4వ తేదీన బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం కానుంది.
ఇదిలా ఉండగా ఈ సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్ల వివరాల గురించి తెలుసుకోవాలని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా మరొక స్టార్ కపుల్స్ కూడా ఈ సీజన్ 6 లో పాల్గొంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో బిగ్ బాస్ సీజన్-3లో హీరో వరుణ్ సందేశ్-వితికా జంట సందడి చేసింది. ఆ తర్వాత కపుల్స్ ఎవరు బిగ్ బాస్ లో పాల్గొనలేదు. ఇక ఇటీవల ప్రారంభం కానున్న బిగ్ బాస్ సీజన్-6లో ప్రముఖ సింగింగ్ కపుల్ పాల్గొననున్నట్లు తెలుస్తొంది. వారెవరో కాదు సింగర్స్ గా మంచి గుర్తింపు పొందిన హేమచంద్ర-శ్రావణభార్గవి.
ఇదిలా ఉండగా ప్రతి బిగ్ బాస్ సీజన్ లో ఒక సింగర్ కి కచ్చితంగా అవకాశం ఉంటుంది. అయితే బుల్లెట్టు బండి ఫేమ్ మోహన భోగరాజు ఈ సీజన్ 6 లో పాల్గొననుందని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు హేమచంద్ర, శ్రావణ భార్గవి కూడా బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలలో నిజం ఎంత ఉందో తెలియాలంటే కొంత కాలం వేచిచూడాల్సిందే.ఇక ఈ సీజన్‌లో మొత్తం 19 మంది కంటెస్టెంట్లు సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 4 ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. అందువల్ల ఈ సీజన్ 6 కోసం సెలెక్ట్ అయిన కంటెస్టెంట్స్‌ను వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచినట్లు తెలుస్తోంది.