బిగ్ బాస్ 6 ఆఫర్ అందుకున్న బుల్లెట్టు బండి సింగర్?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా యంగ్ సింగర్స్ హవా నడుస్తోంది. బుల్లితెర మీద ప్రసారమవుతున్న సింగింగ్ షోస్ ద్వార ఎంతోమంది యంగ్ అండ్ టాలెంటెడ్ సింగర్స్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఈ క్రమంలో చాలామంది వారు పాడిన ఒకే ఒక్క పాట బాగా ఫేమస్ అయ్యారు. ఇలా సింగిల్ సాంగ్ తో ఫేమస్ అయిన వారిలో లేడీస్ సింగర్ మోహన భోగరాజు కూడా ఒకరు. మోహన భోగరాజు అంటే గుర్తు పట్టడం కష్టం. కానీ బుల్లెట్ బండి సింగర్ అంటే అందరికీ గుర్తు వస్తుంది. ఎన్నో సినిమాలలో మంచి పాటలు పాడినప్పటికీ బుల్లెట్ బండి పాటతో సెలబ్రిటీగా మారిపోయింది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం మోహన భోగరాజు గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బిగ్ బాస్ సీజన్ 6 తొందర్లోనే ప్రారంభం కానుంది ఇప్పటికే ఈ రియాలిటీ షో కి సంబంధించిన లోగో, టీజర్ కూడా విడుదల అయ్యాయి. ఇక ఈ సీజన్ సిక్స్ లో పాల్గొనే కంటెస్టెంట్ ల గురించి రోజుకు ఒక వార్త వినిపిస్తోంది. ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్ల పేర్లు కూడా బయటికి వచ్చాయి. కమెడియన్ చలాకి చంటి, సీరియల్ యాక్టర్ అర్జున్ కళ్యాణ్, యూట్యూబర్ శ్రీహాన్, దీపికా పిల్లి, మరొక యూట్యూబర్ ఆది రెడ్డీ వంటి వారు బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొననున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఎప్పటిలాగే ఈ సీజన్ లో కూడా సింగర్లు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇవ్వనున్నారు.

బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో సింగర్ రేవంత్ పేరు వినిపిస్తోంది. అంతే కాకుండా ఫిమేల్ సింగర్స్ లో మోహన భోగరాజు పేరు కూడా వినిపిస్తోంది. బుల్లెట్ బండి పాటతో ఫేమస్ అయిన మోహన భోగరాజు ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి ఆఫర్లు అందుకుంటు బాగా సంపాదిస్తోంది. ఈ క్రమంలో బిగ్ బాస్ 6 లో ఆఫర్ ఇస్తూ బిగ్ బాస్ యాజమాన్యం వారు ఆమెకు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మోహన భోగరాజు నేరుగా షో ప్రారంభంలోనే బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. లేదంటే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అమ్మడు బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే కొంతకాలము ఎదురుచూడాల్సిందే.