సుశాంత్ ఆత్మహత్య వెనక భయానక కుట్ర
బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వెనక అసలు కారణమేమిటి? బాలీవుడ్ అతడిని విస్మరించిందా? పరిశ్రమ అగ్ర బ్యానర్లు అతడికి అవకాశాలివ్వకుండా గెంటేసాయా? సక్సెస్ ఉండీ పెద్ద స్టార్ గా ఎదగకుండా అతడిని కొన్ని అదృశ్య శక్తులు వెన్నాడాయా? అతడిని పరిశ్రమ నుంచి కొందరు బహిష్కరించారా? .. ఇలాంటి సందేహాలెన్నో తాజాగా పలువురు బాలీవుడ్ ప్రముఖులు వ్యక్తం చేయడం సంచలనమైంది.
సుశాంత్ పై ప్రముఖ బాలీవుడ్ బ్యానర్లు కుట్ర పన్నాయన్న కోణం ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకుముందు యశ్ రాజ్ ఫిలింస్ కి ఎంతో సన్నిహితంగా ఉన్న అతడు ఆ తర్వాత ఆ బ్యానర్ కి దూరం జరిగాడు. ఆదిత్య రాయ్ కపూర్ తెరకెక్కించిన `బేఫికర్` చిత్రంలో తొలుత సుశాంత్ హీరో. కానీ రణవీర్ సింగ్ తో రీప్లేస్ చేశారు. అలాగే సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన రామ్ లీలా లో సుశాంత్ నటించాల్సింది. అక్కడా రణవీర్ తో రీప్లేస్ చేశారు. ఆ తర్వాత అతడిపై బోలెడంత దుష్ప్రచారం సాగిందని పలువురు నటుల వ్యాఖ్యల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
సెల్ఫ్ మేడ్ స్టార్ గా ఎదిగిన సుశాంత్ సింగ్ పై ఎన్నో కుట్ర కోణాలు అవమానాలు.. అవకాశాలు రాకుండా కుయుక్తులు బయటపడుతున్నాయి. క్వీన్ కంగన రనౌత్ అయితే పూర్తిగా నెప్టోయిజం రాజ్యమేలే బాలీవుడ్ ని తిట్టి పోస్తోంది. సుశాంత్ బలహీన మనస్కుడు అంటే తాను నమ్మనని బయటి నుంచి వచ్చిన వ్యక్తుల్ని ఇక్కడ ఇండస్ట్రీ వాచ్ మన్ లు బతకనివ్వరని కంగన.. అనుభవ్ సిన్హా సహా పలువురు వ్యాఖ్యానించడం సెన్సేషన్ అవ్వడమే గాక అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.
బాలీవుడ్ లో వరుస విజయాలతో 50 శాతం సక్సెస్ తో సాటి స్టార్లకు అందనంత ఎత్తులో ఉన్నాడు సుశాంత్. చిచ్చోరే లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కూడా అతడిపై కుట్ర జరిగింది. వరుసగా ఏడు సినిమాల్లో నటించే అవకాశాలు కోల్పోయాడని ప్రముఖ రాజకీయ నాయకుడు సంజయ్ వ్యాఖ్యానించడం వేడెక్కిస్తోంది. అంటే ఇండస్ట్రీలో ఎదగనీకుండా సుశాంత్ పై కుట్ర జరిగిందని ఈ వ్యాఖ్యలు స్పష్ఠం చేస్తున్నాయి. ప్రముఖ నటి కోయినా మిత్రా వ్యాఖ్యల్ని బట్టి ఇండస్ట్రీలో వ్యాపారం.. మాఫియా అనే కోణాలు కూడా బహిర్గతం అయ్యాయి. ఇలాంటి చోట బయటి వ్యక్తులు రాణించడం అన్నది అసంభవం అన్న సంకేతాలు అందాయి.
సుశాంత్ లాంటి బయటి వ్యక్తుల్ని ప్రతిభను కాపాడేందుకు ప్రారంభించిన బాలీవుడ్ ప్రివిలేజ్ క్లబ్ కేవలం కొందరు పరిశ్రమ ఇన్ సైడ్ వ్యక్తులకు వత్తాసు పలుకుతూ ఇతరుల్ని లోనికి రానివ్వదన్న సందిగ్ధతను పలువురు వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో అగ్ర బ్యానర్లు.. బడా దర్శకనిర్మాతలు కేవలం పరిశ్రమ బడా వ్యక్తుల వారసులకే అవకాశాలిస్తారు. వారితోనే పని చేస్తారు తప్ప ప్రతిభను చూసేందుకు ఇష్టపడరు. ఇక్కడ గిట్టని వారిని మట్టు పెట్టే వరకూ వదలరు! అని పలువురి వ్యాఖ్యల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సుశాంత్ సింగ్ ఒత్తిడిలోకి వెళ్లడానికి కారణాల్ని.. ఆత్మహత్య వెనక దారుణ నిజాల్ని అర్థం చేసుకోవడానికి ఇంతకంటే ఏం కావాలి?