బిగ్ బాస్ షోలోకి వచ్చే వారికి ఒక్కొక్కొరికి ఒక్కో నేపథ్యం ఉంటుంది. షోలోకి రావడానికి అందరికీ ఒక్కో వ్యక్తిగత కారణం ఉంటుంది. ఎన్నో యేళ్లుగా గుర్తింపు కోసం కష్టపడుతున్నా కూడా రాకపోవడంతో బిగ్ బాస్ షోను ఆదారం చేసుకుని ఫేమస్ అవ్వాలని అనుకుంటారు. సరైన బ్రేక్ రాని వాళ్లు జనాలను మళ్లీ ఆకర్షించి, వారి అభిమానాన్ని పొందేందుకు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తుంటారు. అలా ప్రతీ ఒక్కరికి ఒక్కో కారణం ఉంటుంది.
సోహెల్ గత పదేళ్లుగా సినిమా పరిశ్రమలో ఉన్నాడట. అయినా సరైన గుర్తింపు రాలేదని ఎన్నో సార్లు తానే స్వయంగా చెప్పుకొచ్చాడు. తన సినిమా రిలీజ్ అయిన క్షణంలో థియేటర్లకు వెళ్లి టిక్కెట్లు తానే కొనుక్కుంటున్నా కూడా.. ఒక్కోసారి జనం లేరని సినిమాను కూడా తీసేసిన సందర్భాలున్నాయని వాపోయాడు. తన పదేళ్ల కష్టమే బిగ్ బాస్ లోని 101 రోజుల ప్రయాణమని.. ఈ బిగ్ బాస్ షోతో అందరి అభిమానాన్ని సంపాదించుకున్నాని చెప్పుకొచ్చాడు.
నాకు సినిమాయే జీవితం వేరేది ఏది తెలియదు.. ఉద్యోగం చేయలేను.. వ్యాపారం చేసేంత తెలివి లేదు.. నాకు తెలిసింది సినిమానే.. బయటకు వెళ్లాక.. హీరోగా సినిమాలు చేసి.. హిట్ కొట్టాలి.. నన్ను ప్రేమించేవాళ్లంతా ఆ సినిమాలను చూస్తారు.. హిట్ చేస్తారని అనుకుంటున్నా అంటూ సోహెల్ కన్నీరు పెట్టేసుకున్నాడు. జర్నీ వీడియో చూశాక.. సోహెల్ తనలోని బాధ, సంతోషాలను బయటకు చెప్పుకున్నాడు. అయితే సోహెల్ బయటకు వచ్చాక హీరోగా మారుతాడని నెటిజన్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.