బూట్‌ కట్ బాలరాజు బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటుంది: మంచు మనోజ్

‘బిగ్‌‌బాస్’ ఫేమ్ సోహెల్ టైటిల్ రోల్ లో శ్రీ కోనేటి దర్శకత్వంలో గ్లోబల్ ఫిలిమ్స్ & కథ వేరుంటాది బ్యానర్స్ పై ఎం.డీ పాషా నిర్మిస్తున్న చిత్రం బూట్‌ కట్ బాలరాజు. మేఘ లేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పాటలు, టీజర్, ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ‘బూట్‌ కట్ బాలరాజు’ ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, హీరోలు సందీప్ కిషన్, మంచు మనోజ్, రోషన్ కనకాల, దర్శకులు శ్రీకాంత్ ఓదెల, సాయి రాజేష్ ముఖ్య అతిధులుగా హాజరైన ఈ వేడుకగా గ్రాండ్ గా జరిగింది.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో సోహెల్ మాట్లాడుతూ.. పాషా గారి లాంటి నిర్మాత దొరకడం నా అదృష్టం. ఆయన మధ్య తరగతి కుటుంబం నుంచే వచ్చారు. సినిమా అంటే ప్యాషన్ తో చాలా హార్డ్ వర్క్ చేసి సినిమాని నిర్మించారు. ఈ సినిమా నిర్మాణం యాభై శాతం పూర్తయిన తర్వాత ఫైనాన్సియల్ గా కొంత ఇబ్బంది ఎదురవ్వడంతో నిర్మాత కాస్త ఒత్తిడికి లోనయ్యారు. ఆయన్ని ఒత్తిడి తీసుకోవద్దని చెప్పాను. మా నాన్న రిటైర్మెంట్ పైసలు, నేను సంపాదించినా పైసలు ఇల్లు కొనుక్కుందామని ఉంచుకున్నవి అన్ని ఈ సినిమాకు పెట్టాను. ఈ సినిమాతో నిర్మాతల కష్టాలు మరింతగా అర్ధమయ్యాయి. నిర్మాత దిల్ రాజు గారికి మా పరిస్థితి చెప్పాం. ఆయన చాలా గొప్ప మనసుతో ‘నైజాం నేను చూసుకుంటా, మీరు ఒత్తిడి తీసుకోవద్దు” అని చెప్పారు. ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఏలూరు విజయ్ గారు సినిమా నచ్చి తీసుకున్నారు. వారికి ధన్యవాదాలు. బ్రహ్మానందం గారు , సందీప్ కిషన్, మంచు మనోజ్, రోషన్ శ్రీకాంత్ ఓదెల, సాయి రాజేష్ గారు, సుమగారు ఇలా అందరూ ఈ వేడుకకు వచ్చి మమ్మల్ని ప్రోత్సహించారు. వారందరికీ కృతజ్ఞతలు. దర్శకుడు కోనేటి గారు రెండేళ్ళు పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డారు. భీమ్స్ అన్న అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సినిమాలో పని చేసిన అందరూ చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమా ఇంత మంచి అవుట్ పుట్ రావడానికి కారణం బెక్కం వేణుగోపాల్ గారు. హీరోయిన్ మేఘలేఖ చక్కగా నటించడమే కాకుండా మా పరిస్థితి అర్ధం చేసుకొని సపోర్ట్ గా నిలిచింది. ఇంద్రజ గారు చాలా సపోర్ట్ చేశారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సినిమాకి వెళ్ళండి. బిగ్ బాస్ లో వునప్పుడు నా ఒరిజినాలిటీ చూసి ప్రేక్షకులు ప్రోత్సహించారు. బూట్ కట్ బాలరాజుని కూడా అలానే థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తారు. చాలా ఫన్ ఎమోషన్ వుంటుంది. ఇందులో చాలా మంచి డ్యాన్స్ కూడా చేశాను. మనం జీవితంలో ఓడిన గెలిచినా ఒక తల్లికి కొడుకు మీద ప్రేమపోదు. అదే ఈ సినిమాలో అద్భుతంగా చూపించాం. ఫిబ్రవరి 2న థియేటర్స్ లో బూట్ కట్ బాలరాజు సినిమా చూడాలని తెలుగు ప్రేక్షలందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను” అన్నారు.

సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ‘‘D ఫర్‌ దోపిడి’ సినిమా చేస్తున్న సమయంలో సోహెల్‌ నాకు పరిచయమయ్యాడు. తను సహజంగా నటిస్తాడు. అవకాశాలను సృష్టించుకుంటాడు. ఆలస్యమైనా ఇలాంటి వారిని ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. సోహెల్‌ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. సోహెల్‌ స్టార్‌ అవుతాడనే నమ్మకం ఉంది. ప్రేక్షకులు మెప్పు పొందడమే ఒక నటుడి ఐడెంటిటీ. దాని కోసం ప్రయత్నిస్తాం. పదేళ్ళుగా ఆ సంకల్పంతో సోహెల్ పని చేస్తున్నారు. బూట్‌ కట్ బాలరాజు కంటెంట్ చాలా బావుంది. టీం అందరికీ ఆల్ తెహ్ బెస్ట్. ఈ చిత్రానికి ప్రేక్షకులు మంచి విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

హీరో మంచు మనోజ్: ‘‘కోలీవుడ్‌, బాలీవుడ్‌లో ‘బిగ్‌బాస్‌’లాంటి షోస్‌లో పాల్గొని, టీవీ సిరీస్‌లో నటించి, సినిమాల్లో హీరోగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. టాలీవుడ్‌లో కాస్త తక్కువ. అయినా సోహెల్‌ అనుకున్నది సాధించాడు. ‘బూట్‌ కట్ బాలరాజు’ కంటెంట్ చాలా బావుంది. బ్రహ్మానందం అంకుల్‌ ఇలాంటి యువ ప్రతిభను ప్రోత్సహించడం గ్రేట్‌. ఆయన్ను చూసి తెలుగు చిత్ర పరిశ్రమ గర్వపడుతుంది. ఆల్‌ ది బెస్ట్‌ సోహెల్‌. ఈ సినిమా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నా” అన్నారు

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం మాట్లాడుతూ..‘బూట్‌ కట్ బాలరాజు’ లో సోహెల్ ని చూస్తుంటే తనలో పట్టుదల, తపన కనిపించింది. ఈ సినిమా ఘన విజయం సాధింస్తుందని చెప్పడానికి అదొక్కటి చాలు. కష్టపడితే తప్పకుండా ఫలితం వుంటుంది. తప్పకుండా ఈ ఏడాది తను విజయాన్ని అందుకుంటాడు. నిర్మాత పాషా మంచి అభిరుచితో సినిమాని నిర్మించారు. ఈ సినిమాని సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు

హీరో రోషన్ కనకాల మాట్లాడుతూ.. సోహెల్ నిరంతరం కష్టపడుతూనే వుంటారు. సినిమా అనేది సమిష్టి కృషి. ప్రేక్షకులంతా ఈ సినిమాని తప్పకుండా థియేటర్స్ లో చుడాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. మీ జీతాలతో వీరి జీవితాలు మార్చండి’ అని కోరారు.

విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా వుంది. సోహెల్ పడిన కష్టం కనిపిస్తోంది. ‘బూట్‌ కట్ బాలరాజు’ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. తప్పకుండా సినిమా పెద్ద విజయం అందుకుంటుదనే నమ్మకం వుంది” అన్నారు

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. సోహెల్ నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. మాది ఒక ఊరు. చిన్నప్పటి నుంచి తనకి సినిమా అంటే ఇష్టం. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు.

దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ.. ఎవరినీ తకువ అంచనా వేయకూడదు. సోహెల్ ఆట ఎప్పుడు మొదలౌతుందో తెలీదు కానీ ఖచ్చితంగా మొదలౌతుంది. ఈ సినిమా కోసమా చాలా కష్టపడ్డాడు. తన కష్టం కోసమైనా ఈ సినిమా బాగా ఆడాలి. నేను టికెట్ కొని థియేటర్స్ కి వెళ్లి సినిమా ఖచ్చితంగా చూస్తాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ తెలిపారు

చిత్ర దర్శకుడు శ్రీకోనేటి మాట్లాడుతూ.. ఈ వేడుకకు విచేసిన అతిథలందరికీ నా ధన్యవాదాలు. కథ దగ్గర నుంచి ఈ సినిమా ప్రయాణంలో బెక్కం వేణుగోపాల్ గారు ఎంతగాని సపోర్ట్ చేశారు. నిర్మాత పాషా గారు చాలా హార్ట్ వర్క్ చేశారు. సోహెల్ ఈ సినిమాని తన భుజాలపై వేసుకొని నడిపించారు. తన ఆలోచన చాలా బావుటుంది. సినిమాని ఎంతగానో సపోర్ట్ చేశారు. ఇంద్రజ గారు, భీమ్స్, ఇలా అందరూ చాలా ప్రోత్సహించారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. వినోదంతో పాటు మంచి భావోద్వేగం వున్న చిత్రమిది. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది” అన్నారు.

బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. సోహెల్ ఇమేజ్ కి తగట్టుగా ఈ సినిమా కథని ఎంచుకున్నాం. యూత్ ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చేలా ఈ కథని తీర్చదిద్దాం. ఎక్కడరాజీ పడకుండా సినిమాని నిర్మించారు. తప్పకుండా సినిమా అందరినీ అలరిస్తుంది. టీం అందరికీ అభినందనలు’’ అన్నారు

నిర్మాత పాషా మాట్లాడుతూ.. బెక్కం వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. దర్శకుడు అద్భుతంగా తీశారు. సోహెల్ కి సినిమా అంటే చాలా ఇష్టం. తనతో సినిమా చేయడం గర్వంగా భావిస్తున్నాను. ఫిబ్రవరి2న సినిమా విడుదలౌతుంది. ప్రేక్షకులంతా థియేటర్స్ లో చూసి ఘన విజయాన్ని చేయాలి’ అని కోరారు. లక్ష్మీ భూపాల, రాహుల్ సిప్లిగంజ్, భీమ్స్ సిసిరోలీ, భోలే, కాసర్ల శ్యామ్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గోన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.