బిగ్ ట్రీట్ : ప్రభాస్ “ఆదిపురుష్” నుంచి మైండ్ బ్లాకింగ్ గా ఫస్ట్ లుక్ టీజర్ పోస్టర్.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ హీరోయిన్ గా అలాగే బాలీవడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా “ఆదిపురుష్” కోసం ఇండియా మొత్తం తెలుసు. అయితే ఈ సినిమా నుంచి అభిమానులు ఎప్పుడు నుంచో చాలా ఆసక్తిగా అప్డేట్స్ కి సమయం కూడా ఆసన్నం కాగా ఈరోజు ఉదయమే ఓ బిగ్ అనౌన్స్మెంట్ ఇస్తున్నట్టుగా నిన్న తెలిపారు.

మరి ఈ అప్డేట్ అయితే ఇప్పుడు రివీల్ చేయగా ఇది మాత్రం భారీ ట్రీట్ అని చెప్పి తీరాలి. ఈ సినిమాలో రామునిగా ప్రభాస్ అసలు ఎలా  ఉంటాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ భారీ అవైటెడ్ పోస్టర్ ని చిత్ర యూనిట్ ఇప్పుడు రిలీజ్ చేశారు.

అన్ని భాషల్లో కలిపి పోస్టర్స్ ని రిలీజ్ చెయ్యగా ఇవి మాత్రం మైండ్ బ్లాకింగ్ గా ఉన్నాయి. ప్రభాస్ ని రాఘవునిగా పరిచయం చేస్తూ అత్యంత శక్తివంతమైన రామ బాణం పట్టుకొని ఉన్న ప్రభాస్ ని చూపించారు. దీనితో ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక బ్లాస్టింగ్ పోస్టర్ గా గూస్ బంప్స్ ఇచ్చే లెవెల్లో మారిపోయింది.

దీనితో ఈ ఉదయం మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ సహా పాన్ ఇండియా ఆడియెన్స్ కి ఒక కొత్త ఉత్సాహం వచ్చినట్టు అయ్యింది అని చెప్పాలి. మొత్తంగా అయితే ఇన్నాళ్ల ఎదురు చూపులకి చిత్ర యూనిట్ మాత్రం మామూలు ట్రీట్ ఇవ్వలేదని చెప్పాలి..