బాలీవుడ్ హీరోయిన్స్ బోల్డ్ గా స్టేట్ మెంట్స్ ఇవ్వటంలో హాలీవుడ్ ని మించిపోతున్నారు. అది క్రేజ్ కోసమో లేక వాళ్ల నైజమో అంతేనో గానీ జనాలకు మాత్రం మాంచి కాలక్షేపంగా ఉంటున్నాయి. తాజాగా బాలీవుడ్ మీడియం రేంజి హీరోయిన్ భూమి ఫడ్నేకర్ ..తన మనస్సులోని మాటలను చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో తన సెక్స్ లైఫ్ గురించి బహిరంగంగానే చెప్పింది.
భూమి మాట్లాడుతూ… నేను ప్రస్తుతం సినిమాలే కాదు…చాలా ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా ఆ ప్రాజెక్టులకు పని చేసేవారితో నాకు ఎలాంటి రిలేషన్స్ లేవు. అలాగని ఈ కెరీర్ ని వదిలి ఇప్పుడు పెళ్లి, ప్రేమ అనే ఆలోచన కూడా లేదు. అలాగే అఫైర్స్ లేవు . అయితే ఈ మాట చెప్తే మీరు నమ్మక పోవచ్చు. కానీ నాకు అఫైర్స్ పెట్టుకుని వాటిని మెయింటైన్ చేసేటంత టైమ్, ఓపిక
రెండూ లేవు.
మరి అంతమాత్రాన నేనోదో శృంగార జీవితానికి దూరంగా ఉంటున్నాను అనుకోవద్దు. ప్రేమ,పెళ్లి,ఎఫైర్స్ లేవు అన్నాను కానీ బాయ్ ఫ్రెండ్స్ లేరనలేదు కదా. నా బిజీ షెడ్యూల్ లలో ఇవన్నీ కుదరదని మా అమ్మకు తెలుసు. అందుకే మా అమ్మే… నా బాయ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయమని ప్రోత్సహిస్తుంది. వాళ్లని స్వయంగా నా దగ్గరకు పంపుతుంది. అంతమాత్రాన నేనోదే వేరే విధమైన జీవితం గడుపుతున్నా అనుకోవద్దు. ప్రస్తుతం భూమి పెండ్నేకర్ ప్రస్తుతం అభిషేక్ చౌబే రూపొందిస్తున్న సన్ చిరయా చిత్రంలో నటిస్తోంది.