14నే వర్మ “భైరవ గీత” 

రామ్ గోపాల్ వర్మ సమర్పణలో  ధనుజయ్ , ఇర్ర మోర్  జంటగా తెలుగు ,కన్నడ భాషల్లో రూపొందించిన “భైరవ గీత “సినిమా ఈనెల 14న విడుదల చెయ్యడాని ప్లాన్ చేసినట్టు తెలిసింది . ఈ సినిమా గత వారమే విడుదల కావలసింది . రజనీ కాంత్ 2. 0 సినిమా మీద వేస్తున్నట్టు  వర్మ ప్రకటించాడు . కానీ చెప్పిన తేదికి వర్మ భైరవ గీత సినిమాను విడుదల చెయ్యలేదు .

భైరవ గీత సినిమా సెన్సార్ కాకపోవడంతో వాయిదా వేసినట్టు చెప్పాడు . అంతేనా రజనీకాంత్ సినిమాకు ఎక్కువ థియేటర్లు ఇవ్వడంతో వర్మ సినిమాకు థియేటర్లు లేకపోవడంతో విడుదల చేయలేకపోయారని ట్రేడ్లో చెప్పుకుంటున్నారు .

ఈ సినిమాకు దర్శకుడు సిద్దార్థ్  కాగా నిర్మాత  భాస్కర్ రాశి .

మొత్తానికి  వర్మ భైరవ గీత సినిమాను  14 వతేదీకి విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు .