లుక్ రానాలా ఉన్నా…టైటిల్ పవర్ ఫుల్ గా ఉంది

మాస్ కు ఉండే ఫాలోయింగ్ ..క్లాస్ సినిమాలకు ..ఆ హీరోలకు ఉండదు. అది హీరోలకు బాగా తెలుసు. అందుకే సాధారణంగా ఏ హీరో అయినా తనకు మాస్ ఇమేజ్ వస్తే బాగుండును అని ఆ విధంగా ట్రై చేస్తూంటారు. యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కి కూడా ఆ సీక్రెట్ తెలుసు.

అందుకే తొలి చిత్రం నుంచి యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాస్ లోకి వెళ్లదామనే ప్రయత్నాలు చేస్తున్నాడు. మాస్ కు నచ్చే కథనే ఎంచుకుంటూ ఆ తరహా సినిమాలు తీసే డైరక్టర్స్ తోనే ముందుకు వెళ్తున్నాడు. తన తదుపరి సినిమా కూడా మాస్ ఆడియన్స్ కి నచ్చేలా ఉండేలా ప్లాన్ కున్నాడు.

‘సాక్ష్యం’ తరువాత బెల్లంకొండ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి ‘కవచం’ అనే పవర్ఫుల్ టైటిల్ ను ఖరారు చేసి, తాజాగా ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. వంశధార క్రియేషన్స్ బ్యానర్‌పై తొలి ప్రయత్నంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీనివాస్‌ మామిళ్ల దర్శకత్వం వహిస్తున్నారు.

కవచం పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ …మరోసారి మాస్‌ యాక్షన్‌ హీరోగా కనిపించనున్నాడు . బాలీవుడ్ నటుడు నీల్‌ నితిన్‌ ముఖేష్‌ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీనివాస్‌ పోలీస్‌ గా అదరకొట్టనున్నారు. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లోనే ఈ విషయాన్ని రివీల్‌ చేశారు చిత్రయూనిట్‌. అయితే ఫస్ట్ లుక్ చూసినవారంతా దగ్గుపాటి రానాలా ఉన్నాడే అని కామెంట్స్ చేయటం విశేషం.