బెల్లంకొండ ‘రాక్షసుడు’టీజర్, ఎలా ఉందంటే..

రీసెంట్ గా ‘సీత’ తో పలకరించిన బెల్లంకొండ శ్రీనివాస్ హిట్ కోసం డెస్పరేట్ గా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే స్ట్రైయిట్ కథ కన్నా ఆల్రెడీ ప్రూవ్ అయిన రీమేక్ అయితే కొంతలో కొంత సేఫ్ అని తమిళంలో సూపర్ హిట్ అయిన ‘రాచ్చసన్’ సినిమాను తెలుగులో ‘రాక్షసుడు’తో పేరుతో రీమేక్ చేసాడు. రమేష్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బెల్లంకొండ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసారు.

Rakshasudu Teaser | Bellamkonda Sreenivas | Anupama Parameswaran

ఇక ఈ టీజర్ చూస్తుంటే.. అమ్మాయిలను చంపే సైకో.. అతని పట్టుకోవడానికి ఒక పోలీస్ టీమ్.. ఇంతకీ ఈ సైకో ఎందుకు అమ్మాయిలను చంపుతాడు. అతన్ని పట్టుకోవడానిని పోలీస్ ఆఫీసర్ అయిన హీరో ఏం చేసాడనేదే ‘రాక్షసుడు’ స్టోరీ అని అర్దమవుతోంది. టీజర్ ఇంట్రెస్టింగ్ ‌గా ఉంది. ‘కవచం’ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాలో మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించే ఈ సినిమాతోనైనా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సక్సెస్ అవుతాడేమో చూడాలి.