బాలయ్య సినిమా అదిరే టైటిల్ కంఫర్మ్ చేసేసిన రైటర్?? హింట్ ఇదేనా.?

టాలీవుడ్ లెజెండరీ ఏక్షన్ హీరోల్లో నందమూరి వారి నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. మరి బాలయ్య హీరోగా చేస్తున్న లేటెస్ట్ సినిమాల్లో తన కెరీర్ లో 107వ సినిమాగా భారీ క్రేజ్ మరియు మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్న చిత్రం కూడా ఒకటి. అయితే ఈ సినిమాని క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా శృతి హాసన్ హీరోయి గా నటిస్తుంది.

మరి ఏపీ తెలంగాణాలో శరవేగంగా షూటింగ్ ని పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం టైటిల్ పై ఆ మధ్య అంతా మంచి హడావుడి నడిచింది. “జై బాలయ్య” అని ఒకటి “అన్నగారు” అంటూ మరొకటి ఇలా పలు టైటిల్స్ వినిపించాయి. కాని అసలు టైటిల్ ఏంటి అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు.

కానీ ఇప్పుడు ఈ సినిమాకి పని చేస్తున్న ప్రముఖ పాటల రచయితా ఈ సినిమా టైటిల్ ఏంటి అనేది కన్ఫర్మ్ చేసేసారు అని చెప్పాలి. అతడే రామజోగయ్య శాస్త్రి కాగా తాను ఈ సినిమాకి పొద్దున్నే పాట రాయడం స్టార్ట్ చేసానని జై బాలయ్య అంటూ టాగ్ పెట్టారు. దీనితో ఈ సినిమా టైటిల్ ఇదే అని ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అని చెప్పాలి. దీనితో అభిమానులు కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నారు.