బోయపాటి కు బాలయ్య 2 కండీషన్స్..ఒప్పుకుంటేనే సినిమా

సినిమా హిట్ అయితే తదుపరి సినిమాకు ఎన్ని డిమాండ్స్ చేసినా సెలంట్ గా భరిస్తారు నిర్మాత, హీరో. ఎందుకంటే తమకు ఆ రేంజి హిట్ ఇస్తాడనే నమ్మకంతో. అదే ప్లాఫ్ అయితే సీన్ మారిపోతుంది. డైరక్టర్ పై ఒత్తిడి పెరుగుతుంది. బడ్జెట్ దగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ నిర్మాత అనుమానంగా చూస్తాడు. ప్రతీది కోత పెట్టడం మొదలెడతారు. ఇప్పుడు అదే బోయపాటికి జరుగుతోందని సమాచారం.

అందుతున్న సమాచారం మేరకు బాలయ్య ముందే కొన్ని కండీషన్స్ పెడుతున్నారట బోయపాటికి. ముఖ్యంగా బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారట. బాలయ్యతో తాను మొదలెట్టబోయే సినిమాకు 70 కోట్లు బడ్జెట్ ఇవ్వటంతో బాలయ్య నో చెప్పేసారట. అంత లావిష్ గా సినిమా వద్దని బిజినెస్ చేయటం చాలా కష్టమని అన్నారట. 50 కోట్లు లోపు సినిమా పూర్తి చేయాలని అన్నారట.

అలాగే వేరే కొత్త ఆఫీస్ తీయవద్దని, తమ ఎన్ బి కే ఫిల్మ్స్ ఆఫీస్ లోనే సినిమా పూర్తి చేయమని చెప్పారట. ఈ రెండు కండీషన్స్ కు ఓకే అన్నాకే బాలయ్య డేట్స్ ఇవ్వటానికి ఒప్పుకున్నారట. మొత్తానికి బాలయ్య సైతం చాలా జాగ్రత్తగా ఉండాలని ఫిక్స్ అయ్యారన్నమాట. ఈ వేసవిలో ఈ షూటింగ్ మొదలుకానుంది.

బోయపాటి, బాలయ్య కాంబోలో గతంలో సూపర్ హిట్స్ వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా బడ్జెట్ పెరుగుతుంది…భారీ రేట్లుకే అమ్ముతారు అనుకున్న వాళ్లకి ఈ వార్త చెక్ పెట్టినట్లైంది. ధైర్యంగా బాలయ్య సినిమాను తీసుకోవచ్చన్నమాట. కథానాయకుడు ..ఎన్టీఆర్ డిజాస్టర్ దెబ్బతో బాలయ్య సైతం ప్రతీ విషయంలోనూ ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.