‘యన్‌టిఆర్‌ – మహానాయకుడు’ ట్రైలర్

‘నేను రాజకీయాలు చేయడానికి రాలేదు, మీ గడపలకు పసుపునై బతకడానికి వచ్చాను’ అంటూ మహానాయకుడు వచ్చేసాడు. 

నటుడు, రాజకీయనాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘యన్‌టిఆర్‌’. తండ్రి ఎన్టీఆర్‌ పాత్రలో తనయుడు బాలకృష్ణ నటించి, నిర్మించారు. ప్రముఖ దర్శకుడు క్రిష్‌ దర్శకత్వం వహించిన …. ఈ బయోపిక్‌ రెండు భాగాలుగా రూపొందిన సంగతి తెలిసిందే.

కాగా తాజాగా చిత్ర ట్రైలర్ ఈ రోజు ( ఫిబ్రవరి 16వ తేదీ) సాయంత్రం 5 గంటల 55 నిమిషాలకు ఈ ట్రైలర్ విడుదల చేసారు.

#NTRMahanayakudu Official Trailer | Nandamuri Balakrishna, Rana Daggubati, Vidya Balan | Krish

రాజకీయాల్లోకి వచ్చాక… ఎన్టీఆర్ ఆయన ప్రయాణం ఎలా సాగింది? మహానాయకుడిగా ఎలా ఎదిగారు? అనే అంశాలతో ఈ రెండో భాగం రూపొందింది. ‘యన్‌టిఆర్‌’ మొదటి భాగం అనుకున్న ఫలితం రాబట్టకున్నా రెండో భాగంపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ వారు..అభిమానులు.

సంక్రాంతికి విడుదలైన తొలి భాగం ‘యన్‌టిఆర్‌ కథానాయకుడు’లో ఎన్టీఆర్‌ సినిమా చరిత్ర ప్రధానాంశంగా సాగింది. రెండో భాగం ‘యన్‌టిఆర్‌ – మహానాయకుడు’లో రాజకీయ చరిత్రను చూపించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 22 విడుదల కానుంది.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ పొందింది. ఈ మేరకు కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. చిత్ర రన్‌టైమ్ 2గంటల 8నిమిషాలు ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు.