మెయిన్ వాళ్లిద్దరి కోసమే బాలయ్య ఎలక్షన్ క్యాంపైన్

తెలంగాణ ఎలక్షన్స్ దగ్గరపడుతున్న ఈ సమయంలో సినీ నటుడు, ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రచారంలోకి దూకబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన ధ్రువీకరించారు. ఈ నవంబర్ 26 నుంచి తెలంగాణలో రోడ్ షోలు, బహిరంగ సభలతో ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేస్తామని తెలిపారు. అయితే ఆయన ప్రధానంగా తన అన్న హరకృష్ణ కుమార్తె సుహాసిని కోసం, అలాగే తన పైసా వసూల్ ప్రొడ్యూసర్ వి ఆనంద్ ప్రసాద్ కోసం ప్రచారం చేయబోతున్నట్లు సమాచారం. వి ఆనంద్ ప్రసాద్ ..శేరలింగంపల్లి నుంచి పోటీ చేస్తున్నారు.

తెలుగుదేశం అధిష్ఠానం ఆదేశం మేరకే ఈ ప్రచారం చేయబోతున్నట్లు ఆయన తెలిపారు.. తన షెడ్యూల్‌లో రోడ్‌ షోలతోపాటు బహిరంగ సభలూ ఉంటాయన్నారు. మహాకూటమి తరఫున బరిలోకి దిగుతున్న కాంగ్రెస్‌ నేతల తరఫున కూడా ప్రచారం చేస్తారా అని ప్రశ్నిస్తే.. రూట్‌ మ్యాప్‌ను అనుసరించి తుది నిర్ణయం తీసుకుంటానన్నారు. ఇక ఈ క్యాంపైన్ చివరి రోజు అంటే డిసెంబర్ 5 దాకా సాగనుంది. ఎలక్షన్స్ డిసెంబర్ 7 న జరగనున్నాయి.

కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌ ల క్యాంపైన్  గురించి చెప్తూ..

‘ నందమూరి కల్యాణ్ రామ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు వాళ్ల వాళ్ల సినిమా షెడ్యూల్స్‌లో బిజీగా ఉన్నారు. నందమూరి సుహాసిని తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై వారిద్దరిని నేను ఇంకా సంప్రదించలేదు.. త్వరలోనే ఇద్దరితో మాట్లాడతా.. వీలు చూసుకుని ఎన్టీఆర్, కల్యాణ్ రామ్.. ఇద్దరూ సుహాసిని తరఫున ప్రచారంలో పాల్గొంటారు..’ అంటూ బాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.