అఫీషియల్ :త్వరలో ‘బాహుబలి-3’..‘బిఫోర్ బిగినింగ్’

ఎస్ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసిన బాహుబలి ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రం తర్వాత వచ్చిన సీక్వెల్ సైతం ప్రపంచవ్యాప్తంగా దుమ్ము రేపింది. దాంతో ఇప్పుడు ‘బాహుబలి-3’..‘బిఫోర్ బిగినింగ్’రాబోతోంది. ఈ విశేషాలు ఇక్కడ చూద్దాం.

త్వ‌ర‌లోనే నెట్‌ఫ్లిక్స్ మాధ్య‌మంలో `బాహుబ‌లి 3` ప్రారంభం కానుంది. `బాహుబ‌లి బిఫోర్ ది బిగినింగ్‌` అనే వెబ్ సిరీస్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. ఇందులో అమ‌రేంద్ర‌ బాహుబ‌లి తండ్రి పాత్ర క‌న‌ప‌డ‌నుంది. ఈ వెబ్‌సిరీస్‌లో టీవీ న‌టుడు అనూప్ సోని న‌టించ‌నున్నారట‌. త్వ‌ర‌లోనే ఈ వెబ్‌సిరీస్‌కు సంబంధించిన మ‌రిన్నీ విష‌యాలు తెలియ‌నున్నాయి.

అనూప్ ఎనిమిదేళ్లపాటు ప్రసారమైన ‘క్రైమ్ పెట్రోల్’కు హోస్ట్‌గా వ్యవహరించారు. అలాగే ఇప్పటి వరకూ అనూప్ పలు రకాల పాత్రలు పోషించారు. ఈ చిత్రం ద్వారా అనూప్ వెబ్ సిరీస్‌లో అడుగుపెడుతున్నారు.

ఈ సందర్భంగా అనూప్ మాట్లాడుతూ,… ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారంకానుంది. ఇది బాహుబలి-2కు ఫ్రీక్వల్‌గా రూపొందుతోంది. ఈ వెబ్‌సిరీస్‌లో అమరేంద్ర బాహుబలి తల్లిదండ్రులు కూడా కనిపించనున్నారు. బాహుబలి చిత్ర యూనిట్‌లో పనిచేసేనవారు ఈ వెబ్‌సిరీస్ కోసం పనిచేస్తున్నారని తెలిపారు.