ట్రైల‌ర్: బట్ట‌త‌ల `బాలా`కు ఎన్నెన్ని బాధ‌లు?

బ‌ట్టత‌ల శాప‌మా సోద‌రా?

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తున్నాడు యంగ్ టాలెంటెడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా. `డ్రీమ్ గ‌ర్ల్` సినిమాతో బాలీవుడ్ తో పాటు యావ‌త్ దేశ వ్యాప్తంగా వున్న ఆడియ‌న్స్‌ని క్లీన్ బౌల్డ్ చేసిన ఆయుష్మాన్ తాజాగా మ‌రో వెరైటీ సినిమాతో ఆక‌ట్టుకోవ‌డానికి రెడీ అవుతున్నాడు. ఆయుష్మాన్ న‌టిస్తున్న తాజా చిత్రం `బాల‌`. ఈ సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్‌ని చిత్ర బృందం గురువారం విడుద‌ల చేసింది. భూమి ఫ‌డ్నేక‌ర్‌, యామీ గౌత‌మ్‌, సౌర‌భ్ శుక్లా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. సినిమాలో ఆయుష్మాన్ ఖురానా గౌర‌వ్ రావ‌త్ అలియాస్ బాల పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.

ల‌క్నోకు చెందిన బాలా బ‌ట్ట‌త‌ల కారణంగా చాలా ఇబ్బందులు ప‌డుతుంటాడు. దాన్నుంచి త‌ప్పించుకోవ‌డం కోసం క్యాప్ పెట్టుకుంటాడు. అయితే అత‌నికి తెల్ల‌గా వుండే అమ్మాయిని పెళ్లి చేయాల‌ని అత‌ని త‌ల్లి దండ్రులు ప్ర‌య‌త్నిస్తుంటారు. ఈ క్ర‌మంలో బాల క్యాప్ ఎందుకు పెట్టుకుంటున్నాడ‌ని నిల‌దీసి ఓ రోజు ఆ క్యాప్‌ని తొల‌గిస్తుంది భూమి ఫ‌డ్నేక‌ర్‌. ఈ బాధ నుంచి త‌న‌ని తాను కాపాడుకుని పెళ్లి చేసుకోవ‌డం కోసం బాల ఎలాంటి పాట్లు ప‌డ్డాడు. ఇంత‌కీ పోయిన అత‌ని త‌ల‌పై మ‌ళ్లీ జుట్టు వ‌చ్చిందా?. అందు కోసం ఎంత వ‌ర‌కు వెళ్లాడు? చివ‌రికి అత‌ని స‌మ‌స్య‌కు ఎలాంటి ప‌రిష్కారం ల‌భించింది? అన్న‌ది వినోదాన్నిజోడించి తెర‌కెక్కించారు.

అంత‌ర్లీనంగా మంచి సందేశాన్ని అందిస్తున్న ఈ సినిమా ఆయుష్మాన్ ఖురానాను మ‌రో లెవెల్‌కి తీసుకెళుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.  ఒక సీరియ‌స్ ఇష్యూని వినోదాన్ని జోడించి ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన తీరు పొట్ట చెక్క‌ల‌య్యేలా వుంది. ఆద్యంతం హాస్యంతో సాగే ఈ సినిమా వ‌చ్చే నెల విడుద‌ల కాబోతోంది. అమ‌ర్ కౌశిక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని దినేష్ విజ‌న్ నిర్మించారు. 

Bala- Official Trailer | Ayushmann Khurrana, Bhumi, Yami | Dinesh Vijan | Amar Kaushik, 8th Nov