బిగ్ బాస్ సీజన్ 4లో తన కామెడీతో ఎక్కువగా ఎట్రాక్ట్ చేసిన ఏకైక కంటెస్టెంట్ అవినాష్. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి సూపర్ సేవన్ వరకు పోరాటం చేసిన ఈ జబర్దస్త్ కమెడియన్ ఊహించని విధంగా ఎలిమినెట్ అయ్యాడు. అవినాష్ కంటే వీక్ కంటెస్టెంట్స్ ను హౌజ్ లో పెట్టుకొని అనవసరంగా మంచి కమెడియన్ ను ఎలిమినేట్ చేసినట్లు సోషల్ మీడియాలో విమర్శలు కూడా వచ్చాయి. అయితే అవినాష్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదుర్కొన్న ఒక చేదు అనుభవం గురించి వివరించాడు.
అవినాష్ మాట్లాడుతూ.. తెలిసి తెలియని వయసులో కొన్నేళ్ల వరకు ఒక అమ్మాయి ప్రేమలో ఉన్నాను. ఇద్దరం పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాము. కానీ ఆ అమ్మాయి సడన్ గా మోసం చేసి వెళ్లిపోయింది. ఆ సమయంలో ఒక్కసారిగా.. పిచ్చివాడిలా మారిపోయాను. ఇక కొంత కాలం అనంతరం ఎలాగైనా మోసం చేసిన అమ్మాయి అసూయ పడేలా ఎదగాలని అనుకున్నాను. రానున్న రోజుల్లో ఇంకా టాలెంట్ తో మరింత గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను.. అంటూ అవినాష్ వివరణ ఇచ్చాడు.
ఇక తాను అనుకున్న గమ్యానికి చేరుకునే వరకు ఎంతటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని చెప్పిన అవినాష్ బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నప్పుడు జీవితం అంటే ఏంటో అర్ధమైందని అన్నాడు. ఇక బిగ్ బాస్ విన్నర్ ఎవరనే విషయంపై స్పందిస్తు.. అరియానా లేదా అబిజిత్ ఇద్దరిలో ఎవరో ఒకరు టైటిల్ విన్నర్ గా నిలుస్తారని, తన ఫ్రెండ్ అరియానా గెలిస్తే తాను గెలిచినట్లేనని అవినాష్ వివరణ ఇచ్చాడు.