Home Tollywood వినాయక చవితికి రిలీజ్ కానున్నఅర్జున్ ‘‘కురుక్షేత్రం’’

వినాయక చవితికి రిలీజ్ కానున్నఅర్జున్ ‘‘కురుక్షేత్రం’’

యాక్షన్ కింగ్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు అర్జున్. వెండితెరపై మార్షల్ ఆర్ట్స్ కు మంచి గుర్తింపు తెచ్చిన అర్జున్.. ఇమేజ్ నే ఇంటిపేరుగా మార్చుకుని యాక్షన్ కింగ్ గా మారాడు. యాక్షన్ హీరోగా దక్షిణాది ప్రేక్షకులందరికీ సుపరిచుతుడైన అర్జున్.. ఇప్పుడు తన కెరీర్ లో అత్యంత అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఆ తరం హీరోలంతా రిటైర్ అవుతోన్న వేళ తను ఏకంగా హీరోగా150వ సినిమా  చేశాడు. అదే కురుక్షేత్రం. అర్జున్ ఇమేజ్ కు అనుగుణంగా.. అత్యంత స్టైలిస్డ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాను ఈ వినాయక చవితి సందర్భంగా విడుదల చేయబోతున్నారు.తమిళంలో ‘‘నిబునన్’’ పేరు తో రిలీజై మంచి పేరుతో పాటు కమర్షియల్ కూడా మంచి వసూళ్లు రాబట్టిన ఈ మూవీ అత్యంత  స్టైలిష్ గా తెరకెక్కించాడు దర్శకుడు అరుణ్ వైద్యనాథన్. ప్యాషన్ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ను శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద శ్రీనివాస్ మీసాల తెలుగులో ఈ వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేయనున్నారు.  యాక్షన్ కింగ్ అర్జున్ తో పాటు ఈ మూవీలో ఇంకా సుమన్, సుహాసిని, ప్రసన్న, వైభవ్, శ్రుతి హరిహరన్ ఇతర పాత్రల్లో నటించారు.

 

సాంకేతిక నిపుణులు :

 

శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్

సంగీతంః ఎస్. న‌వీన్,

మాటలు- శశాంక్ వెన్నెలకంటి 

సినిమాటోగ్ర‌ఫీః అర‌వింద్ కృష్ణ‌,  

ఎడిటింగ్ః స‌తీష్ సూర్య‌, 

స్క్రీన్ ప్లే – ఆనంద్ రాఘవ్ ,అరుణ్ వైద్య నాథ‌న్

కో ప్రొడ్యూసర్ – సాయి కృష్ణ పెండ్యాల

నిర్మాత – శ్రీనివాస్ మీసాల, ఫ్యాషన్ స్టూడియోస్

క‌థ‌,స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం – అరుణ్ వైద్య నాథ‌న్.

 

- Advertisement -

Related Posts

‘లూసిఫ‌ర్’ కి సంగీతం అందించనున్న థమన్ .. నా బిగెస్ట్ డ్రీమ్ అంటూ ఎగ్జైట్మెంట్

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా 153వ చిత్రం జ‌న‌వ‌రి 21న లాంఛ‌నంగా ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ చేసిన లూసిఫ‌ర్ చిత్రాన్ని తెలుగులో మోహ‌న్‌రాజా ద‌ర్శ‌క‌త్వంలో రీమేక్ చేయబోతున్నారు. సినీ...

సంక్రాంతి హంగామా ముగిసింది … ఇక సినిమాల సందడి మొదలైంది !

కరోనా లాక్ డౌన్ తర్వాత థియేటర్లు పున:ప్రారంభం అయినప్పటికీ సినీ పరిశ్రమల్లో అంతగా సందడి కనిపించడం లేదు. థియేటర్లలో సందడి అంతంతమాత్రమే కనిపించింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సంక్రాంతి వేళ థియేటర్లు...

ప్యాంట్ వేసుకోకుండా ఈ రచ్చ ఏంటి.. తేజస్వీ పిక్ వైరల్

బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మడివాడకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమాల ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకున్న తేజస్వీ.. బిగ్ బాస్ షో వల్లే మరింత క్రేజ్ తెచ్చుకుంది. అయితే...

ఎప్పుడూ విసిగించే వాడు.. వరుణ్ తేజ్‌పై నాగబాబు కామెంట్స్

మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. మామూలుగా ఎవరెవరి బర్త్ డే‌లకు స్పెషల్‌గా విషెస్ చెబుతుంటాడు. సినీ రాజకీయ ప్రముఖులు, సన్నిహితులకు సంబంధించిన బర్త్ డేలకు...

Latest News