తెలంగులో సంచలన విజయం సాధించిన విజయ్ దేవరకొండ చిత్రం ‘అర్జున్ రెడ్డి’. ఈ చిత్రాన్ని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డినే హిందీ వెర్షన్‌కు డైరక్ట్ చేస్తున్నాడు. అక్కడ కబీర్ సింగ్ టైటిల్ ఫిక్స్ చేసారు. తాజాగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసారు. పంజాబ్ ప్రాంత బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కనుంది.
ఇక ఈ చిత్రం కోసం రెండు మూడు నెలలుగా షాహిద్ కపూర్ జుట్టు మరియు గడ్డం పెంచుతున్నాడు. ప్రస్తుతం జుట్టు మరియు గడ్డంతో సీన్స్ ను షూట్ చేస్తున్నారు. త్వరలోనే దిల్లీలో షూటింగ్ జరపబోతున్నారు. ఆ తర్వాత షాహిద్ జట్టు – గడ్డం ట్రిమ్ చేసి షూట్ లో పాల్గొంటాడట.
ఈ చిత్రంలో షాహిద్ కపూర్ సరసన కియారా నటిస్తుండగా.. వచ్చే ఏడాది జూన్ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా హిందీ అర్జున్ రెడ్డిలో పలు మార్పులు ఉంటాయని ఇదివరకే దర్శకుడు ప్రకటించిన విషయం తెలిసిందే. మరిన్ని లిప్ టు లిప్ కిస్ లు ఈ సినిమాలో ఎక్సపెక్ట్ చేయచ్చు అనే బాలీవుడ్ టాక్. మరి సందీప్ వంగా అక్కడ కూడా విజయపతాకం ఎగరవేస్తాడేమో చూడాలి.