అరవింద సమేత … 8 రోజుల వసూళ్లు 133. 8 కోట్లు

ఎన్టీఆర్ పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన “అరవింద సమేత. వీర రాఘవ “సినిమా 8 రోజులకు 133. 8 కోట్ల రూపాయలను వాసులు చేసినట్టు నిర్మాత రాధాకృష్ణ పేర్కొన్నాడు . ఈ చిత్రం అక్టోబర్ 11 న విడుదలైంది . సినిమా మీద మిశ్రమ స్పందన ఉన్నప్పటికీ వసూళ్ల  విషయంలో మాత్రం దూసుకెళ్లిన్నట్టు తెలిసింది .

మొదటినుంచి జూనియర్ ఎన్టీఆర్ , దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పెట్టుకున్న నమ్మకం ఈ కలెక్టన్ నిజం చేసింది . ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ  ఎంత వసూలు చేసిందో చూద్దాం .

నిజాం అంటే తెలంగాణ రాష్ట్రము లో 28. 9, విశాఖ పట్నం , ఈస్ట్ గోదావరి , వెస్ట్ గోదావరి ,కృష్ణ ,గుంటూరు,నెల్లూరు  42. 6 సీడెడ్ 17. 7, కర్ణాటక 18. 5,అమెరికా 14. 6, తమిళనాడు . 3. 3, మిగతా ప్రాంతాలు  8. 2. మొత్తం కలిపితే 133. 8 కోట్లు గ్రాస్ కలెక్టన్ అని నిర్మాత చెప్పాడు ఇక నెట్ కలెక్షన్ 81. 6 అని రాధా కృష్ణ  తెలిపాడు .