ఫ్యాన్సీ రేటుకు ఎన్టీఆర్ మూవీ…

                                                               (ధ్యాన్)

ఇప్పుడు టాలీవుడ్‌లో రూపొందుతోన్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో `అరవింద స‌మేత` ఒక‌టి. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ క‌ల‌యిక‌లో సినిమా తెర‌కెక్కుతోంది. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. అన్ని ఏరియాల నుండి బిజినెస్ ప‌రంగా మంచి ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను జీ టీవీ సంస్థ 23.5 కోట్ల రూపాయ‌ల‌కు చేజిక్కించుకుంద‌ట‌. ఎన్టీఆర్ కెరీర్‌లో ఇదే హ‌య్య‌స్ట్ శాటిలైట్ హ‌క్కుల‌ను ద‌క్కించుకున్న చిత్ర‌మిదే. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది. అక్టోబ‌ర్ 10న సినిమాను విడుద‌ల చేసేలా స‌న్నాహాలు చేస్తున్నారు.