యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం అరవింద సమేత వీర రాఘవ. దసరా కానుకగా
గురువారం విడుదల అయిన ఈ చిత్రం బెనిఫిట్ షోనుండే సూపర్ హిట్ టాక్ సొంత చేసుకుంది. త్రివిక్రమ్ తన మాటలతో మరోసారి మ్యాజిక్ చేశారని, ఎన్టీఆర్ నటన పీక్స్‌లో ఉందని బాక్స్‌ఫీస్ కొల్లగొట్టడం ఖాయమని ట్రేడ్ లో వార్తలు వినపడుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడిందని, ఊహకు అందని భారీ మొత్తానికి అమ్ముడు పోయినట్లుగా ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.
అందుతున్న సమాచారం మేరకు..ఈ చిత్రం రిలీజ్ కు ముందు.. ఇరవై కోట్ల దాకా కొనుక్కునేందుకు జీ తెలుగు, స్టార్ మా ఛానెల్స్ పోటీ పడ్డాయి. అయితే నిర్మాత ..సినిమాపై ఉన్న నమ్మకంతో అమ్మేయలేదు. దాంతో ఇప్పుడు హిట్ రావటంతో జీ తెలుగు వాళ్లు ముందుకు వచ్చి ఇరవై మూడున్నర కోట్లకు ఫైనల్ చేసి రాయించుకున్నట్లు సమాచారం.
ముఖ్యంగా చిన్న తెరపై త్రివిక్రమ్ సినిమాలకు ప్రత్యేకమైన మార్కెట్ ఉంది. ఫ్యామీలను ఎట్రాక్ట్ చేసే ఆ సినిమాలు టీఆర్పీలు తెచ్చి పెట్టడంలో ముందు ఉంటాయి. అలాగే ఎన్టీఆర్ సినిమా అన్నా ఆ క్రేజే వేరు. అవన్నీ కాలుక్యులేట్ చేసే జీ తెలుగు రంగంలోకి దిగిందంటున్నారు.